Vijay – Sanghavi : షూటింగ్‌లో సంఘవిని చెడామడా తిట్టేసిన స్టార్ హీరో విజయ్.. అసలేమైంది?
Vijay – Sanghavi : సీనియర్ హీరోయిన్ సంఘవి గురించి తెలియని తెలుగు ప్రేక్షుకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె నటించిన తొలి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ కిృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం మూవీలో తొలిసారిగా సంఘవి నటించింది. ఇందులో హీరో రవితేజ, బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా విడుదల అనంతరం ప్లాఫ్ అయిన దర్శకుడికి, ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక హీరోయిన్ సంఘవి విషయానికొస్తే ఆమె కెరీర్ తమిళ ఇండస్ట్రీలో ప్రారంభమైంది. తమిళ సినిమా అమరావతితో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. అలనాటి స్టార్ హీరోయిన్ ఆరతికి మనవరాలే సంఘవి.
దాదాపు 10 ఏళ్ల కెరియర్ లో 95 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అందులో 45 సినిమాలు కేవలం తెలుగు సినిమాలే విశేషం. అంతేకాకుండా కన్నడ,తమిళ చిత్రాల్లోనూ నటించింది. తొలుత బాలనటిగా పరిచయమైన సంఘవి జన్మస్థలం కర్ణాటకలోని మైసూర్. సంఘవి తన తొలి సినిమాను స్టార్ హీరో విజయ్‌తో నటించింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్‌లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. రాసిగాన్, కోయంబత్తూర్ మాపిలై, విష్ణు,నిలవేవా వంటి సినిమాల్లో కలిసి నటించారు. అయితే, విష్ణు సినిమా షూటింగ్‌కు విజయ్ తండ్రి డైరక్టర్. ఇందులో నీటిలో దిగి డాన్స్ చేసే ఒక సీన్ ఉంటుంది.
హీరోయిన్ సంఘవి చాలా ధైర్యంగా నీటిలోకి దిగి విజయ్ కోసం ఎదురుచూస్తుందట. కానీ, నీళ్లు చల్లగా ఉన్నాయని విజయ్ నీళ్లలోకి దిగడానికి భయపడ్డాడట. చాలాసేపు చూశాక విజయ్ తండ్రికి కోపం వచ్చింది. ఆడపిల్ల సంఘవి ధైర్యంగా దిగింది. మగాడివి నువ్వు ఎందుకు దిగడం లేదని సీరియస్ అయ్యాడట. దీంతో సంఘవిని చూసిన విజయ్ నీవల్లే నన్ను తిడుతున్నారంటూ పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకాడట.అలా విజయ్ తనపై కోప్పడ్డాడంటూ ఘటన జరిగిన పదేళ్లకు సంఘవి ఈ విషయాన్ని బయటపెట్టింది.