Kajal Agarwal : ఆమాటంటే కోసి కారం పెడతా నా కొడకా.. వామ్మో కాజల్ ఏంటి అతడి మీద అలా రెచ్చిపోయింది

 Authored By kranthi | The Telugu News | Updated on :11 March 2023,9:20 pm

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ తెలుసు కదా. మూడు పదుల వయసులోనూ, పెళ్లి అయి బిడ్డకు జన్మనిచ్చినా తన అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకూ తన అందం పెరుగుతోంది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించి బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమా దగ్గర్నుంచి ఇప్పటి వరకు తన ఫిజిక్ మాత్రం మారలేదు. అలాగే మెయిన్ టెన్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

star heroine Kajal Agarwal latest comments viral

star heroine Kajal Agarwal latest comments viral

టాలీవుడ్ మాత్రమే కాదు.. తమిళం, హిందీ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ రాణించింది. తన ఖాతాలో పలు హిట్లను వేసుకొని సక్సెస్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది. అసలు తనలోని అందాన్ని వెలికితీసిందే పూరీ జగన్నాథ్. బిజినెస్ మ్యాన్ సినిమాలో తను ఎంత గ్లామర్ ఒలకబోసిందో తెలుసు కదా. అప్పటి వరకు కాజల్ ఏ హీరోకు లిప్ కిస్ ఇవ్వలేదు కానీ.. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేశ్ బాబుకు రెండు లిప్ కిస్ లు ఇచ్చింది కాజల్. కాజల్ అగర్వాల్.. తన డైలాగ్స్ ను బట్టీ పట్టి మరీ షూటింగ్ లో ఒప్పజెప్పేదట. ఏ సినిమా అయినా సరే..

Kajal Agarwal : డైలాగ్స్ బట్టీ పట్టి మరీ షూటింగ్ లో ఒప్పజెప్పే కాజల్

తను కొంచెం కోపంగా డైలాగ్ చెప్పాల్సి వస్తే నిజంగానే కోపం తెచ్చుకొని ఆ డైలాగ్స్ చెప్పేదట. బిజినెస్ మ్యాన్ సినిమాలో కోసి కారం పెడతా నా కొడకా అనే డైలాగ్ ను కాజల్ చెప్పాలి. పూరీ చెప్పగానే.. అదే రేంజ్ లో కోపంతో ఆ డైలాగ్ ను పూరీని చూస్తూ చెప్పేసిందట కాజల్. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారట. అది తెలుగు బూతు అని తెలిసినా.. తెలుగు రాకున్నా ఎంత ఘాటుగా ఆ డైలాగ్ ను కాజల్ చెప్పింది అని అప్పట్లో ఇండస్ట్రీ కోడై కూసింది. అయితే.. ఎడిటింగ్ లో ఆ డైలాగ్ మాత్రం పోయింది. ఆ డైలాగ్ వల్ల మహేశ్ ఫ్యాన్స్ ఎక్కడ బాధపడతారో అని ఆ డైలాగ్ ను తీసేశారట.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి