Heroine : పెండ్లికి ముందే అత్త‌ను లైన్ లో పెట్టిన స్టార్ హీరోయిన్‌.. మామూల్ది కాదుగా..!

Authored By mallesh | The Telugu News | Published on: August 21, 2022, 3:40 pm

Heroine : మెగా హీరో వరుణ్ తేజ్ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇంట్లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మెగా ఫ్యామిలీలో రాంచరణ్ తర్వాత ఇప్పటికీ ఎవరి మ్యారేజ్ కాలేదు.ఇటీవల నాగబాబు తన గారాల పట్టి నిహారిక కొణిదెల మ్యారేజ్‌ను అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం వరుణ్ తేజ్ మ్యారేజ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. తాజాగా వరుణ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని, వీరి విషయం ఇంట్లో కూడా తెలియడంతో వారు కూడా వివాహానికి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Heroine : ఈ ఏడాది చివర్లో మ్యారేజ్..

వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సీక్రెట్‌గానే కాకుండా అప్పుడప్పుడు పార్టీలలో కూడా ఒకే దగ్గర కనిపిస్తూ అందరిలో అనుమానాలు పెంచేస్తున్నారు. అలాగే లావణ్య పుట్టిన రోజున వరుణ్ తేజ్ రూ.1 కోటి విలువ చేసే డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు.లావణ్య త్రిపాఠి ఇప్పటికే వరుణ్ తేజ్ ఫ్యామిలీలో కలిసిపోయింది. నిహారిక పెళ్లికి సినీ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మందికి ఆహ్వానం వచ్చింది.కానీ అందులో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Star Heroine Lavanya Tripati Marriage Rumours With Varun Tej

Star Heroine Lavanya Tripati Marriage Rumours With Varun Tej

దీంతో వీరి మధ్య ప్రేమ ఉందనేది వాస్తవమని అంతా అనుకుంటున్నారు. అలాగే నిహారిక పెళ్లి టైంలో తన చెల్లెలిని పెళ్లి కూతురు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క పనిలో లావణ్యత్రిపాఠి కూడా పాల్గొందని సమాచారం. వరుణ్ తేజ్ తల్లి పద్మజకు కూడా లావణ్య త్రిపాఠి చాలా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. అలాగే కొడుకు ప్రేమ విషయంలో పద్మజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, లావణ్య కూడా తనకు బాగా నచ్చిందని.. ఆమెను ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని చెప్పినట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా, దీనికి సంబంధించి అటు లావణ్య కానీ,మెగా ఫ్యామిలీ గానీ ఇంతవరకు స్పందించలేదు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp