Home » Entertainment » Star Maa Tv Comedy Stars Comedy Show Again Same Mistake
Entertainment

Star Maa : స్టార్‌ మా ‘కామెడీ స్టార్స్‌’ మళ్లీ అదే తప్పు చేసింది.. జబర్దస్త్‌ ను కొట్టాలంటే ఇలాగేనా?

Authored By
Himanshi
The Telugu News | Published on: January 25, 2022, 12:30 pm
Advertisement

Star Maa : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో ను ఢీ కొట్టేందుకు మా టీవీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఒక సారి కామెడీ షో ను చేసి ప్లాప్‌ అయిన స్టార్ మా ఇప్పుడు మళ్లీ కామెడీ స్టార్స్ పేరుతో స్కిట్‌ లు చేయిస్తూ అలా అలా ముందుకు సాగుతోంది. ఈ కామెడీ స్టార్స్ కు ఓంకార్ ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్ కనుక కాస్త హడావుడి అయితే కనిపిస్తుంది. అందుకే బిగ్‌ బాస్ లో సందడి చేసిన వారు అంతా కూడా ఇప్పుడు కామెడీ స్టార్స్ లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా జబర్దస్త్ కమెడియన్స్ ను దించి కామెడీ స్టార్స్ ను చేస్తున్నారు. పైగా నాగబాబు గెస్ట్ గా అవ్వడంతో మరింతగా షో గురించిన చర్చ జరుగుతోంది.

Advertisement

షో కొత్తగా ప్రారంభించినా కూడా మళ్లీ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ జబర్తస్త్‌ ను దాటడం అసాధ్యం అంటూ ముందుగానే కామెడీ స్టార్స్ నిరూపించుకుంది. కామెడీ స్టార్స్ షో కు మొన్నటి వరకు శ్రీముఖి హోస్టింగ్‌ చేసింది. ఆమె యాంకరింగ్‌ తో షో కు కాస్త పాజిటివిటీ కనిపించింది. కాని ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో దీపిక పిల్లిని తీసుకున్నారు. ఆమెను ప్రేక్షకులు ఇప్పటికే జబర్దస్త్‌ స్టేజ్ పై చూశారు. అయినా కూడా ఆమె ను జనాలు పెద్దగా ఆధరించే అవకాశం కనిపించడం లేదు.

star maa tv comedy stars comedy show again same mistake

Advertisement

Star Maa : కామెడీ స్టార్స్ ‘జబర్దస్త్‌’ అనిపించుకోవడం సాధ్యమా?

జబర్దస్త్‌ నుండి వచ్చిన కమెడియన్స్ తో ఢీ నుండి వచ్చిన యాంకర్‌ మరియు జడ్జ్‌ తో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈటీవీ నుండి వచ్చిన వారే అవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అక్కడ నిరాశ పర్చిన వారిని ఇక్కడ తీసుకుంటున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం చూసిన వాళ్ల మొహాలు ఎన్నాళ్లు చూస్తాం అంటూ మొహం తిప్పేస్తున్నారు. ఇలా పాత వారితో కాకుండా కొత్త వారిని ట్రై చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది సలహా ఇస్తున్నారు. కాని ఈ సమయంలో స్టార్‌ మా ఆ ప్రయోగంను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్నిటీమ్‌ లు కాకున్నా ఒకటి రెండు టీమ్ లు అయినా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి