Sudheer : మరీ అంత పిసినారా?.. ఆది పరువు తీసిన సుధీర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 12, 2021, 9:00 pm

Sudheer హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ Sudheer కాంబినేషన్ ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి స్కిట్ వేస్తే అది అదిరిపోతోంది. ఇక ఢీ షోలో అయితే ఈ ఇద్దరూ కలిసి రఫ్పాడిస్తున్నారు. అటు వైపు రష్మీ, దీపిక పిల్లి పర్వాలేదనిపించినా.. సుధీర్, ఆది మాత్రం ఆ ఇద్దరిని తెగ ఆడేసుకుంటారు. ఈ మధ్య అయితే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ పరువుతీసుకుంటున్నారు. తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో ఆది, సుధీర్ దుమ్ములేపేశారు.

Sudheer And aadi Funnny Skit In Dhee

Sudheer And aadi Funnny Skit In Dhee

 

సుధీర్, ఆది కలిసి స్కిట్ వేశారు. సుధీర్ అసిస్టెంట్‌గా ఆది నటించాడు. అన్నా రాత్రి మేకప్ బ్యాగ్ బయటకు తీసుకెళ్లావా? ఇందులో మేకప్ సామాన్లు తప్పా అన్నీ ఉన్నాయ్.. అటు ఎటు వెళ్తున్నావ్. రాత్రి అటే వెళ్లావ్ కదా? అని అన్నాడు. మేకప్ వేసే ముందు అసిస్టెంట్ రియాక్షన్లు చూపించాడు. ఈ మొహాన్ని పది నిమిషాలు భరించాలా? అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చావ్ అన్నా అంటూ సుధీర్ మొహం మీదే ఆది అసిస్టెంట్ రూపంలో పంచుల మీద పంచులు వేశాడు.

Sudheer And aadi Funnny Skit In Dhee

Sudheer And aadi Funnny Skit In Dhee

మరీ అంత పిసినారా?.. ఆది పరువు తీసిన సుధీర్ Sudheer

ఇక ఆ తరువాత క్యారెక్టర్లు మార్చుకున్నారు. ఆది అసిస్టెంట్‌గా సుధీర్ మారిపోయాడు. క్యారవ్యాన్ ఎక్కే సమయంలో ఆది పరువుతీశాడు సుధీర్. కొంచెం ఆగు అన్నా .. ముందు నేను వెళ్తాను లేదంటూ.. పొట్ట ఆ డోరుకు తాకుతుంది అని సుధీర్ కౌంటర్ వేశాడు.

Sudheer And aadi Funnny Skit In Dhee

Sudheer And aadi Funnny Skit In Dhee

అన్నా డ్రెస్సులు తీసుకొచ్చావా? అని అంటే సుధీర్ అడిగాడు. ఇంత పిసినారివి ఏంటి అన్నా.. డ్రెస్సులు కొనుక్కోవచ్చు కదా? ఆ బెల్టు తీసుకురా.. షూలు తీసుకురా? అని ఎప్పుడూ సుధీర్‌ను ఎందుకు అడుగుతావ్ అని అంటూ పరువుతీసేశాడు సుధీర్.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp