Sudheer : మళ్లీ మొదలెట్టేశారు.. ఎవరి గోల వారిదే.. సుధీర్ అభిమానుల రచ్చ
Sudheer సుధీర్ అభిమానుల గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రతీ చోటకు వచ్చి సుధీర్ అన్న జై అంటారని మిగతా బుల్లితెర సెలెబ్రిటీలు కౌంటర్లు వేస్తుంటారు. ప్రదీప్, రష్మీ, అనసూయ, ఆది, సుమ వంటివారికి ఇది చాలా అనుభవం. ఎక్కడకు వెళ్లినా, ఏం మాట్లాడినా సరే కింద కామెంట్లలో మాత్రం సుధీర్ అన్న, జై సుధీర్ అన్న అనే కామెంట్లు కనిపిస్తాయి. అందులోనూ మరీ ఎక్కువగా కర్ణాటక నుంచి అని చెబుతుంటారు.

sudheer fans fires on thaggedele diwali special event
అయితే వీటిపై ఆ మధ్య కొన్ని సెటైర్లు పడ్డాయి. నువ్వే ఓ వంద మందిని సెట్ చేశావ్ కదా? కర్ణాటక అని చెప్పమని అన్నావ్ కదా? అంటూ సుధీర్ పరువుతీసేశాడు రామ్ ప్రసాద్. అలా సమయం సందర్భం అవసరం లేకుండా సుధీర్ అభిమానులు యూట్యూబ్‌లో కామెంట్లతో రఫ్ఫాడిస్తుంటారు. తాజాగా దీపావళి పండుగ సెలెబ్రేషన్ ఈవెంట్ ప్రోమో వచ్చింది. తగ్గేదేలే అంటూ రాబోతోన్న ఈ షోకు ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Sudheer నిరాశలో సుధీర్ అభిమానులు

sudheer fans fires on thaggedele diwali special event
అసలే దసరా ఈవెంట్‌లో సుధీర్ కనిపించలేదని అభిమానులు హర్ట్ అయ్యారు. ఇక దీపావళి ఈవెంట్లోనూ లేనట్టు కనిపిస్తుండటంలో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సారి ఐదుగురు హీరోయిన్లు ఒకే చోట, ఒకేసారి కనిపిస్తే, పర్ఫామెన్స్ ఇస్తే ఎలా ఉంటుందని ప్రదీప్ ఊరించాడు. ప్రియమణి, రోజా, పూర్ణ, ఇంద్రజ, మన్నార్ చోప్రాలను తీసుకొచ్చారు. కూర్చోబెట్టార. పర్ఫామెన్స్‌లు చేయించారు. మొదటి ప్రోమో వీళ్లపైనే ఉంది. ఇందులో సుధీర్ ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు తమ సుధీర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.