Sudigali Sudheer : ఈటీవీ, మల్లెమాలను వదిలేసిన 8 వారాల తర్వాత సుడిగాలి సుధీర్ అనసూయల స్పందన ఏంటో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : ఈటీవీ, మల్లెమాలను వదిలేసిన 8 వారాల తర్వాత సుడిగాలి సుధీర్ అనసూయల స్పందన ఏంటో?

Sudigali Sudheer : ఈటీవీ మల్లెమాల కారణంగా సుడిగాలి సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ గా నిలిచాడు. ఒకప్పుడు మ్యాజిక్ చేసుకొని జీవనం గడిపిన సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అంటే అది కేవలం జబర్దస్త్ కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ లో ఒక చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తర్వాత అనూహ్యంగా టీం లీడర్ గా ఎదిగి ఎన్నో ఈటీవీ కార్యక్రమాల్లో కనిపించి సందడి చేశాడు. తద్వారా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 September 2022,7:30 pm

Sudigali Sudheer : ఈటీవీ మల్లెమాల కారణంగా సుడిగాలి సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ గా నిలిచాడు. ఒకప్పుడు మ్యాజిక్ చేసుకొని జీవనం గడిపిన సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అంటే అది కేవలం జబర్దస్త్ కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ లో ఒక చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తర్వాత అనూహ్యంగా టీం లీడర్ గా ఎదిగి ఎన్నో ఈటీవీ కార్యక్రమాల్లో కనిపించి సందడి చేశాడు. తద్వారా హీరో రేంజ్ లో ఈటీవీ ప్రేక్షకుల్లో గుర్తింపును దక్కించుకున్నాడు. అంత గుర్తింపు వచ్చి సినిమాల్లో వరుసగా నటించింది కూడా జబర్దస్త్ ని సుడిగాలి సుదీర్ వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అనేది అందరికీ తెలిసిందే.. పారితోషికం విషయంలో విభేదాలు తలెత్తడం వల్లే స్టార్ మా ఛానల్ కి ఆయన వెళ్లి పోయాడు అనేది టాక్.

కేవలం సుడిగాలి సుదీర్ మాత్రమే కాకుండా యాంకర్ గా కెరియర్ ని జబర్దస్త్ లోనే ఆరంభించి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న అనసూయ కూడా స్టార్ మా కార్యక్రమానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఈటీవీ మల్లెమాల కార్యక్రమాలను వీడిపోయి రెండు నెలలు అవుతుంది. ఈ సమయంలో వీరిద్దరి యొక్క ఫీలింగ్ ఏంటి అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. ఈటీవీ మరియు మల్లెమాల ఈ రెండు నెలల కాలంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించింది. వాటిల్లో వారిద్దరు లేకపోవడం చాలా లోటుగా ప్రేక్షకులు భావించారు.

sudigali sudheer and anasuya joining star maa tv they lose big chances

sudigali sudheer and anasuya joining star maa tv they lose big chances

వారిద్దరు కూడా ఆ రెండు కార్యక్రమాల్లో నటించకపోవడంతో చాలా నష్టపోయి ఉంటారు. ఇప్పటి వరకు వీరిద్దరూ స్టార్ మా చానల్లో ఏం చేయబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. వరుసగా సినిమాల్లో అయితే నటిస్తున్నారు కానీ వీరు ముందు ముందు బుల్లి తెర ద్వారా ఎలాంటి కార్యక్రమాలను చేస్తారు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వారిద్దరు కూడా అనవసరంగా ఈటీవీ మరియు మల్లెమాల సంస్థలను వదిలేశాం అని భావిస్తూ ఉంటారంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఛాన్స్ ఉంటే వారిద్దరూ తిరిగి ఈటీవీ మల్లెమాల కార్యక్రమాల్లో కనిపించేందుకు ఓకే చెబుతారేమో.. కానీ వారికి అవకాశం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది