Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వ‌దిలేశాడా.. బుల్లితెర‌పై ర‌చ్చ మొద‌లు పెట్టాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వ‌దిలేశాడా.. బుల్లితెర‌పై ర‌చ్చ మొద‌లు పెట్టాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2024,3:00 pm

Sudigali Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన క‌మెడీయ‌న్ సుడిగాలి సుధీర్. ఇండ‌స్ట్రీకి రాక‌ముందు ఎన్నో క‌ష్టాల‌ని చ‌వి చూసిన సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి వ‌చ్చాక సెల‌బ్రిటీగా మారాడు. మ‌నోడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ సినిమాలు కూడా చేశాడు. సుడిగాలి సుధీర్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. ఇందులో కాలింగ్‌ సహస్త్ర పెద్దగా ఆడలేదు. డిజాస్టర్‌ అయ్యింది.సాఫ్ట్ వేర్‌ సుధీర్‌, గాలోడు సినిమాలు మంచి ఆదరణ పొందాయి. థియేట్రికల్‌గా, డిజిటల్‌ పరంగానూ నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం గోట్‌ అనే సినిమాలో నటిస్తున్నారు.

Sudigali Sudheer ఇక బుల్లితెర‌పై సంద‌డి

అయితే ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉన్న‌ప్ప‌టికీ ఎందుకో వాయిదా ప‌డుతుంది. అయితే చాలా కాలంగా బుల్లితెర‌కి దూరంగా ఉంటున్న సుడిగాలి సుధీర్ తిరిగి బుల్లితెరకి తిరిగి వస్తుండటం, షోస్‌ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆహా`లో `సర్కార్‌ 4 షో చేస్తున్నారు సుధీర్. ప్రదీప్‌ మాచిరాజు స్థానంలో సుధీర్‌ యాంకర్‌గా మారాడు. ఇప్పుడు మళ్లీ ఈటీవీలో కొత్త షో చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ పేరుతో కొత్త షోని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మాస్‌ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్‌. మాస్‌ హీరో లెవల్‌లో సుధీర్‌ ఎంట్రీ ప్రోమో కట్‌ చేశారు.

Sudigali Sudheer సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వ‌దిలేశాడా బుల్లితెర‌పై ర‌చ్చ మొద‌లు పెట్టాడుగా

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వ‌దిలేశాడా.. బుల్లితెర‌పై ర‌చ్చ మొద‌లు పెట్టాడుగా..!

ఆట చూస్తావా అంటూ ఆయన చెప్పే విధానం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అదిరిపోయాయి. ప్రోమో దుమ్మురేపేసిన కూడా ఇప్పుడు ఆయ‌న బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం, ఈటీవీలోనే షో చేయడం గురించి పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది. ఏంటి సుధీర్ సినిమాలు వదిలేశాడా.. ఇక బుల్లితెర‌కే ప‌రిమితం అవుతాడా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. సినిమా, బుల్లితెర న‌టులు త‌మ ఫ్యామిలీతో క‌లిసి ఈ షోలో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది