Sudigali Sudheer : హీరోయిన్ అందాలను పదేపదే చూస్తూ దొరికిపోయిన సుడిగాలి సుధీర్.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : హీరోయిన్ అందాలను పదేపదే చూస్తూ దొరికిపోయిన సుడిగాలి సుధీర్.. వీడియో !

Sudigali Sudheer : జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ కాలింగ్ సహస్ర ‘. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా డాలీషా నటించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతకాలపై విజయ్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Sudigali Sudheer : హీరోయిన్ అందాలను పదేపదే చూస్తూ దొరికిపోయిన సుడిగాలి సుధీర్.. వీడియో !

Sudigali Sudheer : జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ కాలింగ్ సహస్ర ‘. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా డాలీషా నటించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతకాలపై విజయ్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలో సుడిగాలి సుధీర్ హీరోయిన్ డాలిషాను పదే పదే చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మా వదినమ్మ రష్మీ ఏమైపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ ఈ సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.

తాజాగా విడుదలైన కాలింగ్ సహస్ర ట్రైలర్ లో యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు బాగా రాసుకున్నారు. నరకం అంటే మనసు చనిపోయి మనిషి బ్రతికి ఉండడం, ఇంతమందికి నరకం చూపించిన వాడికి నరకం అంటే ఏంటో నేను చూపిస్తా, భయం లో ఉన్నోడికి బాధ ఉండదు , బాధలో ఉన్న వాడికి భయం ఉండదు ఇలా ట్రైలర్ లో డైలాగులు అదరగొట్టేశారు. ఈ కాలింగ్ సహస్ర సినిమా ద్వారా సుడిగాలి సుదీర్ ని కొత్తగా చూపిస్తారని తెలుస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది