Sudigali Sudheer : స్పెషల్ స్కిట్స్ తో నెట్టుకు వస్తున్న జబర్దస్త్.. కొత్త హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు ఎక్కడ?
Sudigali Sudheer : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షో లకు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు. అయినా కూడా ఇప్పటికీ అవే టాప్ పొజిషన్ లో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జబర్దస్త్ లో కొత్తగా వస్తున్న కమెడియన్ ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఎప్పుడో వచ్చిన సుడిగాలి సుదీర్ మరియు హైపర్ ఆది టీం లతోనే ఇంకా నెట్టుకొస్తున్నారు.
ఇంకా ఎన్నో కొత్త టీమ్ లు వచ్చినా ఇప్పటి వరకు ఎవరూ సరైన ప్రతిభను కనబరచి నవ్వించడంలో సఫలం కాలేకపోయారు. దాంతో కొన్ని టీమ్ లను తొలగించడం జరిగింది.. కొన్ని టీంలు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే కొత్త టీమ్ లో ప్రకటించే విషయంలో నిర్వాహకులు కాస్త వెనకంజ వేస్తున్నారు. ఈ కారణం వల్లే కొత్తగా టీమ్ లను క్రియేట్ చేసే టైంలో వ్యక్తిగతంగా పేరు పెట్టకుండా స్పెషల్ టీం అంటూ పెడుతున్నారు. స్పెషల్ టీం నాలుగైదు వారాల ఫర్ఫార్మెన్స్ లను చూసి ఆ తర్వాత శాశ్వతంగా చేయాలనే ఉద్దేశంతో మల్లెమాల వారు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు.స్పెషల్ టీం ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి. అమ్మాయిలతో ఒక స్పెషల్ టీం చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీం కామెడీ ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో ఎత్తేసారు.

Sudigali Sudheer Jabardast comedy show is not doing well last some weeks
ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్పెషల్ టీం తీసుకు వచ్చారు. ఆ స్పెషల్ టీం లు పెద్దగా ప్రభావం చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఆ స్పెషల్ టీం లను కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి అంటు వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ వంటి కమెడియన్స్ ఎందుకు రావడం లేదు అని మల్లెమాల వారు జుట్టు పీక్కుంటున్నారు. కొత్త వారికి అవకాశాలు ఇస్తున్న కూడా వారు ఉపయోగించుకోలేక పోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ విషయంలో నిర్వాహకులు ఇంకా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని ప్రేక్షకులు మరియు అభిమానులు కోరుకుంటున్నారు.