Sudigali Sudheer : ఊరించి ఊసురుమనిపించారు.. హర్టైన్ సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 11, 2022, 1:30 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై అసమానమైన ఆదరణను సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై చిన్న స్థాయిలో మొదలైన సుధీర్ ప్రయాణం.. ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. సుధీర్ లేకపోతే ఆ షో వెలవెలబోవాల్సిందే. సుధీర్ కనిపించని షోలకు టీఆర్పీలు కూడా కనిపించవు. దానికి తాజాగా ఉదాహరణే ఢీ షో. ఆ షో నుంచి సుధీర్ బయటకు రావడంతో పరిస్థితి తారుమారైంది.అదే సమయంతో పతనమైపోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకి సుధీర్ ప్రాణం పోశాడు. సుధీర్ హోస్ట్‌గా వచ్చిన సమయం నుంచి శ్రీదేవీ డ్రామా కంపెనీ షో పైపైకి వెళ్తూ వచ్చింది.

దెబ్బకు టీఆర్పీల్లో మిగతా షోలను బీట్ చేసేస్తోంది. అలా సుధీర్ స్టార్డం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సుధీర్ మీద ప్లాన్ చేసే ఈవెంట్లు, షోలు ఇట్టే హిట్టవుతుంటాయి. అందుకే మల్లెమాల టీం వీలైనంతగా సుధీర్ కేంద్రంగానే ప్లాన్ చేస్తుంటారు.సుధీర్ పెళ్లి గురించి ఎన్ని రకాల ఈవెంట్లు, షోలు చేశారో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ పెళ్లి మీద ఎన్నో ఈవెంట్లు చేశారు. అవన్నీ బాగానే హిట్ అయ్యాయి. అయితే మధ్యలో అవి కాస్తా శ్రుతి మించుతున్నట్టు అనిపించడంతో కాస్త దూరంగా ఉన్నారు. ఆ తరువాత సుధీర్ రష్మీ స్థానంలో కొత్త కొత్త జంటను ప్రోత్సహించారు.

Sudigali Sudheer on Maraiage And Love In Sridevi Drama Company

Sudigali Sudheer on Maraiage And Love In Sridevi Drama Company

అయితే నిన్నటి శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సుధీర్ పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చి ప్రోమోతోనే హైప్ పెంచేశారు.సుధీర్ మొత్తానికి తన ప్రేమ పెళ్లి విషయాన్ని చెబుతున్నట్టుగా ప్రోమోను కట్ చేశారు. ఇంత మంది అడుగుతున్నారు కదా? ఇప్పుడు చెబుతాను.. నేను చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే అని ఊరించాడు. కానీ చివరకు ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి వద్దు ఫ్యాన్స్ ముద్దు అని చెప్పేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఇలా కావాలనే ప్రోమోలో చూపించడం, ఎపిసోడ్‌లో వెరైటీగా ఉండటంపై సుధీర్ అభిమానులు హర్ట్ అవుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp