Sudigali Sudheer : ఒక్క చోటకు వచ్చిన సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్.. దిష్టి చుక్క కూడా పెట్టేసింది

Authored By Sam C | The Telugu News | Published on: March 12, 2022, 2:00 pm

Sudigali Sudheer : వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ ఉంటాయి. అలాంటి సూప‌ర్ హిట్ కాంబినేష‌న్స్‌లో సుడిగాలి సుధీర్,ర‌ష్మీ జంట ఒక‌టని చెప్పాలి. సుడిగాలి సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత తొమ్మిదేళ్లుగా ఈ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే స్పెషల్ ఈవెంట్లలో మాత్రం ఈ మధ్య కనిపించడం లేదు. ఇక ఢీ షోలోనే ఈ ఇద్దరూ జంటగా కనిపించేవారు. ఇప్పుడేమో అది కూడా సాధ్యపడటం లేదు. సుడిగాలి సుధీర్ రష్మీల మీద గతంలో చేసిన ఎన్నో ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్లు అప్పట్లో ఒక సంచలనం. వీరిద్ద‌రితో ఏదైన షో ప్లాన్ చేయండ‌ని నిర్వాహ‌కుల‌ని కూడా కోరుతున్నారు అభిమానులు. ఈ క్ర‌మంలో మాటీవీ వీరిద్ద‌రిని ఒకే ఫ్రేములో చూపించి ఆనందప‌రిచింది.

మ‌రి కొద్ది రోజుల‌లో హోళీ వేడుక కానుండ‌గా, ఇందుకు సంబంధించి స్పెష‌ల్ ఈవెంట్ ప్లాన్ చేసింది మ‌ల్లెమాల‌. రంగ్ దే అంటూ వచ్చిన ఈ ఈవెంట్‌లో సుధీర్ కనిపించలేదు. ఎప్పటిలానే ఆది, రాం ప్రసాద్, ఇమాన్యుయేల్, వర్షలే కనిపించారు. సుధీర్ ఎక్కడా? అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అనుకోకుండా మనోడు మాటీవీ స్పెష‌ల్ షోలో ప్ర‌త్య‌క్షం అయి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి, రష్మీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ కనిపించాడు. రష్మీ కోసం సుధీర్ పాట పాడటం, రష్మీ దిష్టి చుక్క పెట్టేయడం అంద‌రిని తెగ ఆక‌ట్టుకుంది.

Sudigali Sudheer Rashmi Gautam appears in maa tv event

Sudigali Sudheer Rashmi Gautam appears in maa tv event

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ స‌డెన్ స‌ర్‌ప్రైజ్…

మొదటి సారిగా స్టార్ మా ఈవెంట్ లో సుధీర్ క‌నిపించ‌డంతో ఈ విష‌యం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.సుధీర్‌.. మ‌ల్లెమాల‌కి బ్రేక‌ప్ చెప్పాడా, లేదంటే కేవ‌లం గెస్ట్ అప్పియ‌రెన్స్ గానే మా టీవీ షోలో సంద‌డి చేశాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు రష్మి గౌతమ్. ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే.. ఈ ఇద్దరూ అలా కనిపిస్తుంటే చూసే వాళ్లకు కన్నుల పండగే. అంత బాగా సెట్ అయిపోయారు ఈ జోడీ. అందుకే నిర్వాహకులు కూడా వాళ్లతోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. చేసిన ప్రోగ్రామ్స్‌కు ప్రోమోలను సైతం రష్మి, సుడిగాలి సుధీర్పై కట్ చేస్తుంటారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp