vishnu priya stunning look poster released
Vishnu Priya : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు చెప్పగానే అందరికి పూలు పండ్లు గుర్తుకు వస్తాయి. ఆయన స్టార్ హీరోయిన్స్ పై కూడా పండ్ల, పూల వర్షం కురిపించాడు. రమ్యకృష్ణ, రంభ,విజయశాంతి, నగ్మా వంటి స్టార్ హీరోయిన్స్ తమ అందాలపై ఆయన పళ్ళు, పూలు విసిరారు. తరాలు మారుతున్నా కూడా ఆయన క్రియేటివిటీ మారలేదు. తాప్సి,త్రిష, శ్రేయాలపై కూడా ఆయన ఈ ప్రయోగాలు చేశారు. నా నడుముపై గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు వేశారంటూ తాప్సి బాలీవుడ్ ఈవెంట్ లో చెప్పగా ఆ వేదికపై ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. రాఘవేంద్రరావుకి హీరోయిన్ నడుము ఓ ఫాంటసీ… అక్కడ పూలు, పళ్ళు విసరడం ద్వారా ఆడియన్స్ కి రొమాంటిక్ ఫీలింగ్ కలిగించగలమని ఆయన గట్టిగా నమ్ముతారు.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న కొత్త చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ . శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
vishnu priya stunning look poster released
తాజాగా ఈ మూవీ నుండి నటి విష్ణు ప్రియా లుక్ విడుదల చేశారు. సదరు పోస్టర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. విష్ణు ప్రియా లంగా, జాకెట్ ధరించి ఉండగా బొడ్డులో మడిచిన తమలపాకు పెట్టారు. వాంటెడ్ పండుగాడ్ చిత్రానికి శ్రీధర్ దర్శకుడు అయినప్పటికీ నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావుదే. ఈ నేపథ్యంలో తన క్రియేటివిటీ అంతా వాడి విష్ణు ప్రియా బొడ్డులో మడిచి తమలపాకు పెట్టాడు. ఇది చూసి అందరు వయస్సు పెరుగుతున్నా కూడా రాఘవేంద్రరావు ఆలోచన మారట్లేదుగా అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైన రాఘవేంద్రరావు క్రియేటివిటీ మరెవరకి సాధ్యం కాదు అని అంటున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.