Sudigali Sudheer : కొత్త పేరు పెట్టేసింది.. సుధీర్ పరువుతీసిన రోజా

Authored By Cinema Desk | The Telugu News | Updated on: February 20, 2021, 9:43 am

Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సుధీర్‌పై ఎన్ని సెటైర్లు వేసినా అందరూ నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సెటైర్లు, పంచ్‌లు శ్రుతీ మిస్తుండటంతో సుధీర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సుధీర్‌ను అంతలా అవమానించాలా? అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే సుధీర్ మాత్రం ఇవేమీ పట్టించుకోడు. జనాలను నవ్వించడానికి ఏదైనా చేస్తామని, పంచ్‌లు తన మీద వేస్తే జనాలు నవ్వుతారంటే వాటికి సిద్దమేనని చెప్పుకొచ్చాడు సుధీర్.

Roja fun with Sudigali Sudheer In Extra Jabardasth

Roja fun with Sudigali Sudheer In Extra Jabardasth

అలా ప్రతీ షోలో స్కిట్లలో సుధీర్‌ను టార్గెట్ చేస్తుంటారు. ప్రతీ స్కిట్‌లో అమ్మాయిల పిచ్చోడు అన్నట్టుగా సుధీర్ మీద ముద్రవేస్తుంటారు. వాటికి తగ్గట్టే రోజా కూడా మధ్యలో పంచ్‌లు వేస్తుంటుంది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్‌కు కొత్త పేరు పెట్టింది రోజా. ఆ పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుడిగాలి సుధీర్ టీం వెరైటీ స్కిట్ వేసింది.

Sudigali Sudheer : సుధీర్ పరువుతీసిన రోజా

సుడిగాలి సుధీర్ ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తిగా నటిస్తాడు. బాబు అనే ఆర్టిస్ట్‌ లండన్ ఎలా వెళ్లాలి అని అడిగితే.. చార్మినార్ మూడో పిల్లర్ కింద సొరంగం ఉంది అక్కడి నుంచి వెళ్లాలి.. అంటూ ఇలా సొరంగాల గురించి చెబుతుంటాడు. మీకు సొరంగాల నుంచి వెళ్లడం బాగా అలవాటు అనుకుంటా అని బాబు సెటైర్ వేశాడు. ఆ వెంటనే రోజా అందుకుని.. సుడిగాలి సుధీర్ కాదు.. సొరంగాల సుధీర్ అంటూ పగలబడి నవ్వేసింది. రోజా అలా అనేసరికి అందరూ నవ్వేశారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp