Sudigali Sudheer : ఆల్రెడీ ఢీ మానేశా?.. మొత్తానికి నోరు విప్పిన సుడిగాలి సుధీర్
Sudigali sudheer : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ చిన్న గ్యాప్ తర్వాత తిరిగి జబర్దస్త్ వేదికపై ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంట్రీ ఇవ్వగానే అనసూయ సుడిగాలి సుధీర్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇకపోతే ఈ వారానికి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుధీర్ తనపై తానే సెటైర్ వేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
సుడిగాలి సుధీర్ కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా ఢీ కార్యక్రమంలో కూడా టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఢీ కార్యక్రమం నుంచి సుడిగాలి సుదీర్ తప్పుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని స్వయంగా జబర్దస్త్ వేదికపై సుడిగాలి సుదీర్ కన్ఫామ్ చేశారు.

Sudigali sudheer self satire on him in jabardasth latest promo
Sudigali sudheer : మానవ అంటూ లేడీ గెటప్ వేసిన శాంతి..
ఈ ప్రోమోలో భాగంగా శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో మానవా… మానవా అంటూ సుడిగాలి సుధీర్ దగ్గరకు రాగానే ఆల్రెడీ ‘ఢీ’ మానాను. ఇంకేం మానాలి రా బాబు అని సుధీర్ అనగానే అందరూ నవ్వారు. ఈ విధంగా సుడిగాలి సుదీర్ తను ‘ఢీ’ నుంచి తప్పుకున్నానని స్వయంగా ఈ వేదికపై నోరు విప్పారు. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ‘ఢీ’వేదికపై కూడా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ షో రేటింగ్స్ కి కారణమయ్యారు. అలాంటి సుధీర్ ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు తనే ప్రకటించారు.