Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ వింత జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడా.. ఆయ‌న కెరీర్ ప‌రిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ వింత జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడా.. ఆయ‌న కెరీర్ ప‌రిస్థితి ఏంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :25 September 2022,7:30 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల‌లో సుధీర్ పేరు తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. జబర్దస్త్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తరువాత కాలంలో తన కామెడీ టైమింగ్ తో ఏకంగా ఒక టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ పేరుతో తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గరయ్యాడు. చాలా కాలం నుంచి ఈటీవీ ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయిన సుడిగాలి సుధీర్ తాను చేస్తున్న మల్లెమాల షోల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మాటీవీ లో డ్యాన్స్ షో చేస్తూ సంద‌డి చేస్తూనే మ‌రోవైపు హీరోగా అలరిస్తున్నాడు.

తాజాగా అందుతున్న సమాచార ప్రకారం సుడిగాలి సుధీర్‌కు భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారట. తెరపై స్కిట్స్ యాంకరింగ్ చేసే పొజిషన్ లో కూడా లేని ప‌రిస్థితిలో ఉన్నాడంటూ కొందరు యూట్యూబ్లో చెప్పుకొస్తున్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. దీనిపై సుడిగాలి సుధీర్ కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వారి ఫ్రెండ్స్ కానీ ఎటువంటి క్లారిటీ లేదు. త్వ‌ర‌లో అయిన దీనిపై స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

Sudigali Sudheer suffers with disease

Sudigali Sudheer suffers with disease

Sudigali Sudheer : సుధీర్ విష‌యంలో ఇది నిజ‌మా?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని ఒక వెలుగు వెలిగిన సుధీర్ ఇతర ఛానెళ్లు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఇతర ఛానెళ్ల ప్రోగ్రామ్ లకు ఓకే చెప్పడం జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా సుధీర్ ఏ ప్రోగ్రామ్ లో కూడా కనిపించడం లేదు. ఈటీవీ ఇచ్చిన స్థాయిలో సుధీర్ కు ఇతర ఛానెళ్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడమే సుధీర్ కు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది