Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జోడి మీదే సెటైర్లు.. రెచ్చిపోయిన సుజాత ప్రవీణ్
Sudigali Sudheer : బుల్లితెరపై సెటైర్లు వేయడం, వేరే జంటలు చేసిన స్కిట్లను పేరడీ చేసి కించపరచడం అందరికీ తెలిసిందే. వేరే చానెల్, వేరే షోలో చేసిన స్కిట్లను మరో చోట స్పూపులుగా మార్చుతున్నారు. మొన్నటి హోళీ ఈవెంట్‌లో సుధీర్ రష్మీ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. చాలా రోజులు తరువాత అలా ఈ ఇద్దరూ ఒక్క ఈవెంట్‌లో కనిపించారు.
అందులో సుధీర్, రష్మీ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక చివరకు సుధీర్ బుగ్గన రష్మీ ఓ దిష్టి చుక్క తీసింది. తన కళ్ల కాటుక తీసి సుధీర్ బుగ్గన పెట్టేస్తుంది. ఆ సీన్ ఎక్కువగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ సీన్‌ని శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్పూప్ చేసి పడేశారు. సుధీర్ ముందే ఈ స్పూప్ వేసేశారు.

Sujantha And Praveen Satires On Rashmi Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : సుధీర్ ముందే సెటైర్లు..
ప్రవీణ్, సుజాత ఇద్దరూ కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెచ్చిపోయారు. సుజాత తన కాటుక తీసి ప్రవీణ్‌కు దిష్టి చుక్క పెట్టేసింది. నీ కెరీర్‌కు దిష్టి తగలొద్దు అంటూ రష్మీలా కలరింగ్ ఇచ్చింది. దీంతో సుధీర్ పగలబడి నవ్వేశాడు. మొత్తానికి సుధీర్ రష్మీ జోడిపైనే ఇలాంటి సెటైర్లు వేసేస్తున్నారు. అది కూడా సుధీర్ ముందే అంటే ఈ జోడి మీద అందరి దృష్టి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.