Suma Adda : హీరోయిన్ తో ముద్దులు, రొమాన్స్ తో రెచ్చిపోయిన సుమ కొడుకు.. సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో వైరల్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Suma Adda : హీరోయిన్ తో ముద్దులు, రొమాన్స్ తో రెచ్చిపోయిన సుమ కొడుకు.. సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో వైరల్..!

Suma Adda : బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న కొన్ని షోలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే క్యాష్ ప్రోగ్రామ్. అయితే ఈమధ్య ఈ షో కి సుమ అడ్డా అని సరికొత్తగా సీజన్ ప్రారంభించారు. క్యాష్ షోఎంత సక్సెస్ఫుల్ అయిందో సుమ అడ్డా కూడా అంతే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సుమ హోస్ట్ గా […]

 Authored By anusha | The Telugu News | Updated on :20 December 2023,11:15 am

ప్రధానాంశాలు:

  •  Suma Adda : హీరోయిన్ తో ముద్దులు, రొమాన్స్ తో రెచ్చిపోయిన సుమ కొడుకు.. సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో వైరల్..!

Suma Adda : బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న కొన్ని షోలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే క్యాష్ ప్రోగ్రామ్. అయితే ఈమధ్య ఈ షో కి సుమ అడ్డా అని సరికొత్తగా సీజన్ ప్రారంభించారు. క్యాష్ షోఎంత సక్సెస్ఫుల్ అయిందో సుమ అడ్డా కూడా అంతే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సుమ హోస్ట్ గా చేస్తున్న ఈ ప్రోగ్రాం కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. యూట్యూబ్ లో ఈ ప్రోగ్రాం కి సంబంధించి ప్రోమోలకు, ఎపిసోడ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. బుల్లితెరపై ఈ షో కి విశేష ప్రేక్షకాదరణ ఉంది. తన మాటలతో, పంచులతో సుమ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా సుమ అడ్డా ప్రోగ్రాం కి సంబంధించి ప్రోమో విడుదలైంది.

సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సుమ అడ్డా షో కి బబుల్ గమ్ టీం సందడి చేశారు. హీరో రోషన్, హీరోయిన్ మానస చౌదరి, రాజీవ్ కనకాల , దర్శకుడు రవికాంత్ పేరేపు షో లోపాల్గొన్నారు. ఇక సుమ తన భర్త మీద కూడా తనదైన పంచులు వేసింది. అయితే రోషన్, మానస చౌదరి మీద ఉప్పెన సినిమాలోని జలపాతం నువ్వు పాటను ప్లే చేశారు. పడవలో కూర్చున్న రోషన్ పక్కనే ఉన్న హీరోయిన్ మానసతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. అది చూడలేక సుమ ముఖాన పైట కొంగు కప్పుకుంటుంది. కాసేపటి తర్వాత లాభం లేదని కట్ చెప్పింది. దీంతో రోషన్ మీరే కదా అమ్మా నటించమన్నారు అని తల్లితో అన్నాడు. అందుకే కట్ చెప్పానని సుమ అన్నారు.

అలాగే రాజీవ్ కనకాలను మీ ఆవిడ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది అని సుమా అడిగారు. అత్యద్భుతమైన నవ్వు గుర్తొస్తుంది అని రాజీవ్ అన్నారు. దీంతో సుమ రాజా ఆపు అంటూ సిగ్గు పడిపోయారు. ఇక రోషన్ రాజీవ్ కనకాల ఎదురు ఎదురుగా వస్తూ ఉంటారు. రాజీవ్ కనకాల తొడ కొడుతూ ఇది 15 వ ఎపిసోడ్ అంటూ, చూసుకుందాం రా అన్నట్లుగా రోషన్ దగ్గరికి వస్తాడు. అక్కడే ఉన్న సుమతో రోషన్ అమ్మ నాకు సపోర్ట్ చేయాలని అంటాడు. దీంతో సుమ రోషన్ తో పోనీలే నాన్న .. నీ సినిమా వల్ల నాన్న ఎక్ససైజ్ చేస్తున్నాడు అంటుంది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకుంటారు. అలా సుమ అడ్డ ప్రోమో ముగిసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది