Anchor Suma : యాంకర్ సుమ మీదే పంచ్.. సులభ్ కాంప్లెక్స్‌లంటూ పరువుతీసిన నటుడు
Anchor Suma : తెలుగు యాంకర్ లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి సుమ తనదైన శైలిలో పంచులు వేస్తూ వివిధ రకాల టాస్క్ లను ఆడిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంటారు. ఇలా విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలలో క్యాష్ ఒకటి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ కార్యక్రమానికి సీరియల్ నటీనటులు కౌశిక్-కళ్యాణ్, లహరి -సంయుక్త, సుమిత్- హిత్రేష్, అనిల్ -రవి కిరణ్ హాజరయ్యారు.మామూలుగా సుమిత్ ఎక్కడ ఉంటే అక్కడ తన పై ఎవరైనా పంచులు వేయడం లేదా ఇతరులకు సెటైర్లు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో కూడా సుమ వరుసగా నటుడు సుమిత్ పై సెటైర్లు వేయగా సుమిత్ కూడా తనదైన శైలిలో సుమ పై పంచ్ ల వర్షం కురిపించారు.

Sumith comments on anchor Suma in cash program
Anchor Suma : సుమ బాస్కెట్ బాల్ లీగ్..
పైసా వసూల్ గా రౌండ్ లో భాగంగా ఒక కాయిన్ అందులో వేయాలి అది ఎక్కడ పడితే అంత డబ్బు గెలుచుకుంటారు. ఒకవేళ జోకర్ వస్తే సుమ చెప్పే టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రోమోలో భాగంగా ఈ కాయిన్ ఇందులో పడితే ఆ డబ్బులు మీకు వస్తాయి లేదంటే సుమ లీగ్ లో భాగంగా బాస్కెట్ బాల్ లీగ్ లో భాగంగా పనిష్మెంట్ ఉంటుంది. అనగానే వెంటనే సుమిత్ స్పందిస్తూ… సుమ ఇది సులబ్ కాంప్లెక్స్ లీగ్ కాదు అంటూ తన పరువు మొత్తం తీసేసాడు.
