Sundeep Kishan : భోజ‌నం దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారా.. మా రెస్టారెంట్‌కి ఫ్రీగా వెళ్లండంటున్న హీరో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sundeep Kishan : భోజ‌నం దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారా.. మా రెస్టారెంట్‌కి ఫ్రీగా వెళ్లండంటున్న హీరో

 Authored By aruna | The Telugu News | Updated on :22 October 2024,7:00 pm

Sundeep Kishan : టాలీవుడ్ హీరోలు సంపాదించ‌డ‌మే కాదు అందులో కొంత భాగాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కి కూడా ఉప‌యోగిస్తున్నారు. వారిలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కూడా ఒకరు.అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌ ఉదార‌త చాటుతూ ఉంటారు. ఈ హీరో వివాహ భోజ‌నంబు అనే రెస్టారెంట్ చైన్‌ను న‌డిపిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల‌లో 7 రెస్టారెంట్‌లు ర‌న్ అవుతూ ఉండ‌గా, ప్ర‌తి బ్రాంచీ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి భోజ‌నం పంపిస్తున్నారు. ఆక‌లితో ఉన్న‌వారికి ఇలా త‌న ఏడు రెస్టారెంట్స్‌ నుంచి ప్ర‌తిరోజు 350 మందికి ఫ్రీగా ఫుడ్ పెట్ట‌డం జ‌రుగుతుంది.

Sundeep Kishan : మంచి మ‌న‌సు..

తాజాగా సందీప్ కిష‌న్ ఈ విష‌య‌మై ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. త‌న టీమ్ పేద‌ల‌కు భోజ‌నం పంచుతున్న ఫొటోల‌ను ఈ పోస్ట్ ద్వారా హీరో పంచుకున్నారు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు టీమ్ పేదలకు భోజనం పంచుతున్న పలు ఫొటోలు షేర్ చేసి.. వివాహ భోజనంబు చేస్తున్న మంచి పనికి నేను గర్వపడుతున్నాను. ఎవరైనా ఫుడ్ కోసం కష్టపడితే మీకు దగ్గర్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ప్యాకెట్ ని ఫ్రీగా తీసుకోండి అని ట్వీట్ చేసాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు సందీప్ ని అభినందిస్తున్నారు. ఈ ట్వీట్ వైర‌ల్ కాగా, నెటిజ‌న్లు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Sundeep Kishan భోజ‌నం దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారా మా రెస్టారెంట్‌కి ఫ్రీగా వెళ్లండంటున్న హీరో

Sundeep Kishan : భోజ‌నం దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారా.. మా రెస్టారెంట్‌కి ఫ్రీగా వెళ్లండంటున్న హీరో

ఇక సందీప్ కిష‌న్ హిట్,ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.త‌న ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’ కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ న్యూ షూటింగ్ షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది.20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, సందీప్ కిషన్, ఇతర ముఖ్యమైన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది