Bigg Boss 5 Telugu : అండర్ వేర్‌ల గోల.. సన్నీ చేసిన పనికి ఆనీ మాస్టర్ పరువుపాయే

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 21 October 2021, 10:12 am

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అయితే నిన్నటి ఆటలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి. బంగారు కోడి పెట్టె అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడో వారంలో ఆ టాస్కుతోనే ఇళ్లు గడుస్తోంది. ఇక ఇందులో భాగంగా కొన్ని స్పెషల్ టాస్కులు కూడా వస్తున్నాయి. వాటిని కంప్లీట్ చేస్తే.. వారికి ఎక్స్ ట్రాగా ఫుడ్డులోకి ఎగ్స్ ఇస్తాను అని బిగ్ బాస్ ప్రకటించాడు

Sunny And Anee master In Bigg Boss 5 Telugu

Sunny And Anee master In Bigg Boss 5 Telugu

దీంట్లో భాగంగా విశ్వకు ఓ స్పెషల్ ఎగ్ వచ్చింది. ఇందులో తనతో పాటు ఓ కంటెస్టెంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.. ఇ ఇద్దరూ బట్టలు ధరించడంలో పోటీ పడాలి. ఎవరు ఎక్కువ దుస్తులు ధరిస్తారో వారే టాస్క్ విజేత అని అందులో గెలిచిన వారికి ఐదు ఎగ్స్ లభిస్తాయని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో టాస్క్‌లో గెలిచేందుకు విశ్వ తెలివిగా ఆడవాళ్లను, అందులో కాజల్‌ను ఎంచుకున్నాడు. అయితే కాజల్ కూడా గట్టిపోటీనే ఇచ్చింది. ఆమెకు మద్దతుగా సన్నీ, సిరి వంటి వారు వచ్చారు.

 Bigg Boss 5 Telugu : బట్టలు ధరించే టాస్కులో విశ్వ విజేత

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

ఇక ఇంట్లో వాళ్లందరి బట్టలను తీసుకొచ్చారు. చివరకు అందరి అండర్ వేర్‌లను కూడా తీసుకొచ్చాడు. ఆఖర్లో ఆనీ మాస్టర్ అండర్ వేర్‌ను కూడా సన్నీ పట్టుకొచ్చాడు. దీంతో ఆనీ మాస్టర్ పరుగెత్తుకుంటూ వెళ్లి అది నాది అంటూ తీసుకెళ్లిపోయింది. సన్నీ చేసిన పనికి ఆనీ మాస్టర్ పరువుపోయినట్టు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచిపోయింది. ఇక చివర్లో విశ్వ ధరించిన వాటిలో తన అండర్ వేర్‌ కూడా ఉందని సన్నీ నోటీస్ చేశాడు. మొత్తానికి విశ్వ ఆ టాస్క్‌లో గెలిచేశాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp