Chiranjeevi : స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఆనతి కాలంలోనే మెగాస్టార్‌గా ఎదిగారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన చిరంజీవి చాలా మందికి స్పూర్తి. సురేఖతో పెళ్లి జరిగే సమయానికి చిరంజీవి టాలీవుడ్ లో అప్ కమింగ్ నటుడు మాత్రమే. అప్పటికి ఇంకా చిరంజీవికి సరైన గుర్తింపు దక్కలేదు. పునాది రాళ్లు , మనవూరి పాండవులు, ప్రాణం ఖరీదు లాంటి చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే ఉంది. కానీ అల్లు రామలింగయ్య.. చిరంజీవిని ఏరి కోరి అల్లుడిగా ఎంచుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. చిరంజీవి కళ్ళలో నటుడిగా స్పార్క్ ని రామలింగయ్య గమనించారట. అందుకే గొప్ప నటుడు అవుతాడని ముందుగానే పసిగట్టారు.
తన కొడుకు అల్లు అరవింద్ తో చిరంజీవి గురించి ఆరా తీయమని చెప్పారు. పున్నమి నాగు ప్రీవ్యూ ప్రదర్శిస్తుండగా అక్కడ అల్లు అరవింద్ తొలిసారి చిరంజీవిని కలిశారు. అల్లు అరవింద్ తో చిరు చాలా వినయంగా మాట్లాడారట. అల్లు అరవింద్ కూడా నాన్న గారు మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు.. వస్తారా అని అడిగారు. అలా మొదటిసారి చిరంజీవి అల్లు రామలింగయ్యని కలిశారు. పెళ్లి అయిన వేళా విశేషమో ఏమో కానీ.. క్రమంగా చిరంజీవికి ఎక్కువ సినిమాలు రావడం.. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగాయి. పెళ్లైన నాటి నుండి ఇప్పటి వరకు సురేఖ చిరంజీకి కి తన స్దాయి శక్తుల సపోర్ట్ చేస్తూనే వచ్చింది.
చిరంజీవిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనని సురేఖకి..చిరు లో ఓ విషయం మాత్రం నచ్చదట. టైంకి భోజనం చేయరట. సినిమా షూటింగ్ లో ఉంటే అస్సలు టైంకి తినడట. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు అయినా టైంకి తింటారా అంటే అది లేదట. ఎప్పుడో ఏదో ఒక్క పని చేస్తూనే ఉంటారట . ఇప్పటికి చిరు.. ఫుడ్ టైం కి ప్రాపర్ గా తీసుకోడట..ఆయన ఆరోగ్యం పాడైనప్పుడు సురేఖకు చాలా భయమేస్తుందని..ఆ టైంలో చెప్పుతుంటాను అందుకే హెల్తీ ఫుడ్ టైం కి తినాలి అని..అంటుంటారట. ఆ మధ్య చిరుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆ సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా చాలా ఆందోళన చెందినట్టు తెలుస్తుంది. కాగా, కరోనా నుండి కోలుకున్న తర్వాత చిరు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.