Naga Chaitanya : విడాకుల విషయం దగ్గర నుండి సమంత- నాగ చైతన్యకు సంబంధించిన ఏ విషయం అయిన నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. సమంతని ఎంతో ప్రాణంగా ప్రేమించి చివరికి ఆమెకు విడాకులు ఇవ్వడం చైతూకే కాదు అభిమానులకి కూడా ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అయితే తాజాగా ఆయన ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియెన్‌సెస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకు జడ్జ్‌మెంట్ లేకపోవటం వల్లనే తప్పు జరిగిందని ఆయన తెలిపారు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మాట్లాడిన నాగ చైతన్య కొత్త దర్శకులతో పెద్దగా పని చేయటం లేదు అని ప్రశ్న వచ్చినప్పుడు .. ‘‘నేను డైరెక్టర్స్‌ని బాగా నమ్ముతాను. డైరెక్టర్ ఎంత బాగా చెబితే అంత బాగా నటిస్తాను. ఆడియెన్స్ నన్ను లవ్ స్టోరీస్, ఎమోషనల్ జర్నీస్ సినిమాలతో ఎంకరేజ్ చేశారు. దాంతో కమర్షియల్ ఫార్మేట్‌కు సూట్ అవుతానా అనే సందేహం ఉంటుంది. కొత్త దర్శకులతో ఇంతకు ముందు చేశాను. కానీ బ్యాడ్ ఎక్స్‌పీరియెన్‌సెస్ ఎదురయ్యాయి. అలాగని వారిది తప్పని నేను అనలేను. నా సెలక్షన్‌లో కూడా లోపం ఉండొచ్చు’’ అన్నారు.
ఇటీవల `లవ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఆకట్టుకున్నారు నాగచైతన్య . వరుస విజయాల అనంతరం ఇప్పుడాయన `థ్యాంక్యూ` చిత్రంతో రాబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్యతో మాట్లాడుతూ, తమ్ముడు అఖిల్ గురించి కూడా స్పందించారు . ఏజ్‌లో ఆరేడు ఏళ్లు గ్యాప్ ఉందని, దీంతో ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. తనకు ఆలోచన విధానం, అఖిల్ ది పూర్తి భిన్నంగా ఉంటుందని, అందుకే కథల విషయంలో చర్చించుకుంటామని తెలిపారు చైతూ.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.