Surekha Vani : చేతిలో మందు బాటిల్‌, ఎదురుగా కేక్.. పొట్టి దుస్తుల‌లో సురేఖా వాణి షేక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekha Vani : చేతిలో మందు బాటిల్‌, ఎదురుగా కేక్.. పొట్టి దుస్తుల‌లో సురేఖా వాణి షేక్

 Authored By sandeep | The Telugu News | Updated on :29 April 2022,12:30 pm

Surekha Vani: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవ‌ల సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ ద‌క్కించుకుంటుంది. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాలు చేసి అల‌రించిన సురేఖా వాణి ఇప్పుడు మాత్రం చాలా స్లో అయింది. త‌న కూతురితో సోష‌ల్ మీడియాలో మాత్రం నానా హంగామా చేస్తుంది. వీలున్న‌ప్పుడ‌ల్లా సురేఖా వాణి సుప్రిత ఇద్దరూ కూడా వెకేష‌న్స్‌కి వెళుతుంటారు. ఈ రోజు సురేఖా వాణి బ‌ర్త్ డే కాగా, ఇందుకోసం వారు మూడు రోజుల ముందే థాయ్‌లాండ్‌కు చెక్కేశారు. తల్లీకూతుళ్లిద్దరూ కూడా బిజినెస్ క్లాస్‌లో చెక్కేసినట్టున్నారు. ఇక బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ ఫేమస్ అని అంటుంటారు. సుప్రిత థాయ్ మసాజ్‌ ఫోటోలను కూడా షేర్ చేసింది.

Surekha Vani సురేఖా బ‌ర్త్ డే బ్లాస్ట్..

ఇక తాజాగా సురేఖా వాణి త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా చేతిలో మందు బాటిల్ ఎదురుగా కేక్ పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తుంది. అంతేకాదు పొట్టి దుస్తుల‌లో క్లీవేజ్ షో చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. సురేఖా వాణి సంద‌డి చూసి ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు. వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది అందాల ముద్దుగుమ్మ ర‌చ్చ మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ ప‌డే లుక్స్ ఆమెవ‌ని సోష‌ల్ మీడియాలో ఫొటోలు చూసిన వారే చేసే కామెంట్స్‌.

surekha vani birthday Party video

surekha vani birthday Party video

కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా క‌న‌ప‌డుతున్నార‌ని కొంద‌రు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ స‌మ‌యంలో కూతురు సుప్రిత‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఈమె చేసిన హ‌ల్ చ‌ల్ ఈమెకు మ‌రింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది