Home » Entertainment » Surekha Vani Night Long Drive
Entertainment

Surekha vani : అర్దరాత్రి దొంగచాటుగా.. సురేఖా వాణి రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 19, 2021, 1:30 pm
Advertisement

Surekha vani : నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వయసొచ్చిన కూతురు ఉన్నా కూడా సురేఖా వాణిని చూస్తే అలా అనిపించదు. ఇంకా యంగ్‌గా ఉంటూ కూతురి కంటే మోడ్రన్‌గా కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాంటి సురేఖా వాణి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఆమె చేసే ఎక్స్‌పోజింగ్.. షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో అగ్గిరాజేస్తుంటాయి. అలా సురేఖా వాణి సోషల్ మీడియాను ప్రతీ రోజూ ఏదో ఒకలా షేక్ చేస్తూనే ఉంటుంది.

Advertisement

సురేఖా వాణి తన కూతురు సుప్రిత కలిసి పార్టీలు, పబ్‌లంటూ తిరుగుతూనే ఉంటారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఇద్దరూ ఫుల్లుగా తిరిగేశారు. ప్రతీ వారం ఎక్కడికో ఓ చోటకు వెళ్లేవారు. షూటింగ్‌లు ఉంటే కూతురిని కూడా తీసుకెళ్తూ ఉండేది. ఒక వేళ షూటింగ్‌లు లేకపోతే వీకెండ్ సమయాల్లో ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్తుండేవారు. అయితే తాజాగా తన కూతురు లేకుండా సురేఖా వాణి విజయవాడకు వెళ్లినట్టు కనిపిస్తోంది.

Surekha vani Night Long Drive

Advertisement

Surekha vani : అర్దరాత్రి దొంగచాటుగా.. సురేఖా వాణి రచ్చ

ఫ్యామిలీ టైం అంటూ తన అన్న బర్త్ డేను గ్రాండ్ ‌గా సెలెబ్రేట్ చేసింది సురేఖా వాణి. నిన్న రాత్రి ఫ్యామిలీతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసిన సురేఖా వాణి ఓ వీడియోను షేర్ చేసింది. అర్దరాత్రి దొంగచాటుగా ఇలా విజయవాడ రోడ్డులో నైట్ డ్రైవింగ్‌కు వచ్చానని చెప్పుకొచ్చింది. బైక్ మీద నైట్ డ్రైవ్‌కు వెళ్లానని చెబుతూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా సురేఖా వాణి మాత్రం ఇలా నిత్యం ఎంజాయ్ చేస్తూనే ఉంటోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి