Ram Charan 16 : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాకి సర్‌ప్రైజింగ్ టైటిల్.. దీనిని జనాలు యాక్సెప్ట్ చేస్తారా..!
Ram Charan 16 : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కియారా అద్వాని ఇందులో కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం వైజాగ్‌లో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. మార్చి 19 వరకు సుమారు ఐదు రోజుల పాటు వైజాగ్ లో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ జరగనుండగా, ఈ షెడ్యూల్ పూర్తి కానుండగా, చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడట.
మార్చి 2న రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ కానుందని సమాచారం. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ మూవీ గత కొద్ది రోజులుగా ‘RC16’ అనే పేరుతో వార్తలలో ఉంది. కాని తాజా సమాచారం ప్రకారం మూవీకి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ‘పెద్ది’ అనే టైటిల్ కి పాన్ ఇండియా అప్పీల్ లేదని టైటిల్ మార్చాలంటూ మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే పెద్ది అనే పేరుని తెలుగులో ఉంచి ఇతర భాషలలో వేరే టైటిల్ పెడతారేమో అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.. స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమాని పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది.మూవీ టైటిల్‌ని మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేయనున్నట్టు టాక్. ఇక చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొదటిసారి చరణ్ తో జాన్వీ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. ప్రస్తుతం జాన్వీ.. ఎన్టీఆర్‌తో దేవర చేస్తుండగా, తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఈ సినిమా చేయనుండడం ప్రత్యేకం అని అంటున్నారు
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.