AP Politics : మళ్లీ జగనే సీఎం.. ఆ కూటమి వైసీపీని ఏం చేయలేదు..!
AP Politics : మాధవి లత ఈమె మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలో నచ్చావులే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2008లో విడుదలైన ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో స్నేహితుడా అరవింద 2 సినిమాల్లో కూడా నటించి అలరించారు. అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజెపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు . అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా సినీ నటి బీజెపీ నాయకురాలు మాధవి లత ఏపీ రాజకీయాలపై స్పందించారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన ఆమె ముక్కు సూటిగా సినీ ఇండస్ట్రీపై పలు రకాల అభిప్రాయాలను బయటకు చెప్పడంతో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు అని చెప్పొచ్చు.
అయినప్పటికీ తనవు వెనకడుగు వేయకుండా అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు రాష్ట్రాల్లో బీజెపీ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు రేసులో ముందున్నారు అని కూడా చెప్పాలి. ఇక ఇదే విషయాన్ని అనేక రకాల జాతీయ సంస్థలు సర్వేలు కూడా చేసి వెల్లడించాయి. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు మాత్రం బీజెపీ మరియు జనసేనతో కూటమిగా ఏర్పడి బరిలోకి దిగారు. ఇలాంటి తరుణంలో ఆంధ్ర రాజకీయాలపై తాజాగా మాధవి లత స్పందిస్తూ…ఆంధ్ర రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ జనసేన బీజెపీ కలిసి పోటీ చేస్తున్నాయని , ఇక ఈ మూడు పార్టీలు పొత్తులో కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గెలిచేద్దాం అంటే సబవు కాదని ఆమె తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదని, ఎందుకంటే సీఎం జగన్ కు చాలా రాజకీయ పరిణామాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్ చాలా చేశారని దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో డబ్బు ఖర్చు పెట్టినా కూడా వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. మూడు పార్టీలు కలిసాయి కదా కచ్చితంగా గెలుస్తాం ఇంకేం ఉందిలే అనుకుంటే కుదరదని ఆమె తెలియజేశారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలసి గ్రౌండ్ లెవెల్ నుండి నిరంతరం కష్టపడి పని చేసినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా జగన్ ను ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీలు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆమె తెలియజేశారు. అయితే అసలు సీట్లు రావా అంటే కచ్చితంగా వస్తాయి కానీ గెలుపు వస్తుందా రాదా..? అధికారం వస్తుందా రాదా..? అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఉన్న బలమంతా కూడ కట్టుకుని కష్టపడితే తప్ప ప్రస్తుతం జగన్ ను ఎవరు ఓడించలేరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి సినీ నటి మాధవి లాత చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.