Surya : సూర్య అసలు పేరు అదా.. ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోయిన్.. బాబోయ్ మామూలోడు కాదండోయ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surya : సూర్య అసలు పేరు అదా.. ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోయిన్.. బాబోయ్ మామూలోడు కాదండోయ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Surya : సూర్య అసలు పేరు అదా.. ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోయిన్.. బాబోయ్ మామూలోడు కాదండోయ్..!

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా సూర్య తో స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేశారు. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఇప్పటికే ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది. సూర్య గెస్ట్ గా వచ్చిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈమధ్యనే స్ట్రీమింగ్ అయ్యింది. ఈ చిట్ చాట్ లో సూర్యకు సంబనించిన ఎన్నో విషయాలు తెలిసాయి. ముఖ్యంగా సూర్య అసలు పేరు.. అతని ఫస్ట్ క్రష్ ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించారు.

సూర్య అసలు పేరు శరవణన్ అని చెప్పారు. ఇక సూర్య నడిపిస్తున్న అగరం ఫౌండేషన్ గురించి చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో సూర్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని సూర్య తమ్ముడు కార్తీకి కాల్ చేశారు బాలకృష్ణ. సూర్య ఫస్ట్ క్రష్ ఎవరు అని కార్తిని అడిగారు. అప్పుడు వద్దని సూర్య వారించినా చికు బుకు చికుబుకు రైలే గౌతమి గారంటే అన్నయ్యకు ఇష్టమని చెప్పాడు కార్తి.

Surya నువ్వు కార్తి కాదురా కత్తి..

ఆ టైం లో కార్తి నువ్వు కార్తి కాదురా కత్తి అని అన్నాడు. అంతేకాదు సర్ కార్తి ఈ షోకి వస్తే తనకు కాల్ చేయండి వాడి సీక్రెట్స్ బయట పెడతా అని అన్నారు. సూర్య, బాలకృష్ణల మధ్య సరదా సంభాషణ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలతో పాటు తన చేతనైంత సాయం చేస్తూ సొసైటీకి ఎంతో మేలు చేస్తున్నాడు సూర్య.

Surya సూర్య అసలు పేరు అదా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోయిన్ బాబోయ్ మామూలోడు కాదండోయ్

Surya : సూర్య అసలు పేరు అదా.. ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోయిన్.. బాబోయ్ మామూలోడు కాదండోయ్..!

సినిమాల ద్వారా ప్రజలకు ఏదో ఒక మంచి చెప్పాలన్నదే తన ఉద్దేశం అని చెబుతూ వచ్చే సూర్య రాబోతున్న కంగువ అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది