Pooja Hegde : సూర్య 44.. పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : సూర్య 44.. పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుందా..?

 Authored By aruna | The Telugu News | Updated on :11 December 2024,7:00 pm

Pooja Hegde : అందాల భామ పూజా హెగ్దేకి సౌత్ లో బ్యాడ్ టైం కొనసాగుతుంది. అమ్మడు చేసిన సినిమాలు వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఛాన్స్ లు రావట్లేదు. అయినా కూడా అమ్మడు ఎంతో ఓపికగా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తెలుగు నుంచి పెద్దగా అవకాశాలు దక్కించుకోలేని పూజా హెగ్దే కోలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుంది. సూర్య 44లో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సూర్య తో సమానమైన రోల్ లో అమ్మడు నటిస్తుందట.

సూర్య 44 సినిమాలో పూజా హెగ్దే పాత్ర చాలా పొటెన్షియల్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. సినిమాలో హీరో పాత్రకు ఈక్వల్ గా హీరోయిన్ రోల్ ఉంటుందట. అంతేకాదు సూర్య సినిమాలో తనది ఇంపార్టెంట్ రోల్ కాదు కథ మొత్తం తన మీదే నడుస్తుందని అంటుంది పూజా హెగ్దే. రాధే శ్యాం తర్వాత తెలుగులో ఛాన్స్ లు లేని పూజా బేబ్ కి కోలీవుడ్ నుంచి ఈ లక్కీ ఛాన్స్ వచ్చింది.

Pooja Hegde సూర్య 44 పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుందా

Pooja Hegde : సూర్య 44.. పూజా హెగ్దే పిచ్చెక్కించేస్తుందా..?

Pooja Hegde : పూజా హెగ్దే గ్లామర్ పరంగా..

ఐతే వచ్చిందే అదునుగా పూజా ఈ సినిమాలో ఒక రేంజ్ లో రెచ్చిపోతుందని తెలుస్తుంది. సాంగ్స్ లోనే కాదు సినిమాలో కూడా పూజా హెగ్దే గ్లామర్ పరంగా నో లిమిట్స్ అనేస్తుందట. ఈ సినిమా తర్వాత మళ్లీ తన గురించి అందరు మాట్లాడుకునేలా చేస్తుందట. తెలుగులో స్టార్స్ తో నటించిన పూజా హెగ్దే ఒక్కసారిగా ఛాన్సులు లేక ఖాళీ అయ్యింది. ఐతే అమ్మడు ఏం చేసినా చూడటానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ప్రేక్షలను తన అందంతో మెస్మరైజ్ చేయాలని చూస్తుంది పూజా హెగ్దే. మరి సూర్య 44 మీద అన్ని అంచనాలు పెట్టుకున్న పూజాకి ఈ సినిమా ఎంతవరకు లక్ కలిసి వచ్చేలా చేస్తుందో చూడాలి. పూజా హెగ్దే సిల్వర్ స్క్రీన్ గ్లామర్ షో కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది