Surya : సూర్యతో లక్కీ భాస్కర్.. ఈసారి ప్లాన్ నెక్స్ట్ లెవెల్ అట..!
ప్రధానాంశాలు:
Surya : సూర్యతో లక్కీ భాస్కర్.. ఈసారి ప్లాన్ నెక్స్ట్ లెవెల్ అట..!
Surya : కోలీవుడ్ Kollywood స్టార్ హీరో సూర్య Surya లాస్ట్ ఇయర్ కంగువతో నిరాశ పరిచాడు. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. సూర్య కంగువ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో సూర్య కాస్త ఆలోచనలో పడ్డాడు. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ అలరించింది. ఇక సూర్య ఎన్నాళ్ల నుంచో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా సూర్య మొదటి తెలుగు సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది. Lucky Bhaskar లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య సినిమా రానుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఉగాదికి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తుంది.

Surya : సూర్యతో లక్కీ భాస్కర్.. ఈసారి ప్లాన్ నెక్స్ట్ లెవెల్ అట..!
Surya : వెంకీ అట్లూరి తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో..
Surya సూర్యతో సినిమాకు తెలుగు దర్శకులు క్యూ కడుతున్నారు. వెంకీ అట్లూరి తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి డైరెక్షన్ లో సినిమా ఉండొచ్చని టాక్. ఇప్పటికే సూర్యని కలిసి కథ చెప్పాడట చందు మొండేటి మరో సిట్టింగ్ లో సినిమా కన్ఫం అవుతుందని అంటున్నారు. ఈ సినిమా ఐతే 300 ఏళ్ల నాటి కథతో అదిరిపోతుందని అంటున్నారు. వెంకీ అట్లూరి కథ ఎలా ఉంటుంది అన్నది మత్రం తెలియలేదు.
ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో Lucky Bhaskar లక్కీ భాస్కర్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి Venky Atluri ఈసారి సూర్యతో ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. సూర్య రెట్రో సినిమా ఈ ఏడాది మే 1న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ తర్వాతే నెక్స్ట్ సినిమా షూటింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య ఇన్నాళ్లకు తెలుగు సినిమా చేసే అవకాశం రావడం విశేషం. సూర్య తెలుగు ఫ్యాన్స్ ఈ న్యూస్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. Sitara Entertainments, Chandu Mondeti, Tollywood