
#image_title
Tammannah : టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందరో నటులకు లైఫ్ ఇచ్చింది. ఎందరికో స్టార్ డమ్ ఇచ్చింది. ఆ స్టార్ డమ్ తో వేరే ఇండస్ట్రీలను ఏలిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు తమన్నా. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే పాపులారిటీ పొందింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో తన సత్తా చాటింది. బాలీవుడ్ లోనూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది. తెలుగు ఇండస్ట్రీల లైఫ్ ఇస్తేనే తమన్నా ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కానీ.. కన్నతల్లి లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా తమన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నా వాటిని తిరస్కరిస్తున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. దానికి కారణం ఏంటంటూ అడగగా.. అక్కడ పురుషాధిపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళలను తొక్కేస్తారు.. అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేసింది తమన్నా. అంటే.. ఇన్ డైరెక్ట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అన్నట్టుగా తమన్నా వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే లేపింది. ఎందుకంటే.. ఇన్నేళ్లు సౌత్ ఇండస్ట్రీలో పని చేసి.. నాలుగు రాళ్లు వెనుకేసుకొని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో ఏదో రెండు మూడు ఆఫర్స్ రాగానే టాలీవుడ్ చేదు అయిపోయిందా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
#image_title
నిజానికి తమన్నా తెలుగు తమిళం రెండు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. రాజమౌళి దర్శకత్వంలోనూ నటించింది. బెస్ట్ సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. మరి.. అలాంటి తమన్నాకు సౌత్ ఇండస్ట్రీలో ఏం చేదు అనుభవం ఎదురైందో తెలియదు కానీ.. తను చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే పెద్ద దుమారం లేపాయి. చూద్దాం మరి తమన్నా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటుందా? లేక తన మాటల మీద కట్టుబడి ఉంటుందా?
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.