Tamannaah : ఆ హీరోతో లిప్ లాక్ చేయాలనుంది.. మనసులో మాటను అలా బయటపెట్టేసిందేంటి తమన్నా

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 20, 2022, 11:40 am

Tamannaah : సినిమా ఇండస్ట్రీలో హీరోలు అయినా హీరోయిన్లు అయినా పలానా పాత్రలు మాత్రమే వేస్తామంటే కుదరదు. ఏ పాత్ర అయినా సరే వేయాల్సిందే. ఇండస్ట్రీలో గిరి గీసుకొని కూర్చొంటే కుదరదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఏమాత్రం మొహమాటం ఉండకూడదు. కొన్ని ఎక్స్ పోజింగ్ సీన్లలోనూ నటించాల్సి ఉంటుంది. హద్దులు పెట్టుకుంటే కష్టం తెలుసు కదా. కొన్ని సీన్లలో ఖచ్చితంగా హద్దులు మీరాల్సి ఉంటుంది. కొందరు హీరోయిన్లకు ఇష్టం లేకపోయినా బెడ్ సీన్లలో నటించాల్సి ఉంటుంది.

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఆ సీన్ల విషయంలో ఓపెన్ గా మాట్లాడేసింది. ఆమె ఎవరో కాదు.. హ్యాపీ డేస్ హీరోయిన్ తమన్నా. ఆ సినిమాతో తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన సినిమా కెరీర్ కు ఆ మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తను దూసుకుపోయింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిందా మిల్కీ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా..

Tamannaah talks about that hero crush with her

Tamannaah talks about that hero crush with her

Tamannaah : ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి కామెంట్స్ చేసిన తమన్నా

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ చేయాలనుందని తన మనసులో మాటను బయటపెట్టింది. నిజానికి తమన్నా ఇప్పటి వరకు విజయ్ తో నటించలేదు. కానీ.. అతడిలో లిప్ కిస్ సీన్స్ లో మాత్రం నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. సమంత హోస్ట్ గా వచ్చిన ఓ ప్రోగ్రాంలోనే గెస్ట్ గా వచ్చిన తమన్నా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసి చాలా రోజులు అయింది కానీ.. విజయ్ మాత్రం.. తమన్నా కోరికను ఇప్పటి వరకు తీర్చలేదు. చూడాలి మరి.. తమన్నాతో విజయ్ ఏదైనా సినిమా చేస్తే లిప్ లాక్ చేస్తాడో లేదో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp