Taraka Ratna : బ్రేకింగ్ : తారకరత్న హెల్త్ గురించి ఊహించని బ్రేకింగ్ అప్డేట్ !

Authored By aruna | The Telugu News | Published on: February 13, 2023, 7:20 pm

Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రికి చేరి రెండు వారాలు దాటింది. తారకరత్న ఆస్పత్రికి చేరి వారం రోజులు దాకా తన హెల్త్ గురించి అప్డేట్స్ కనిపిస్తుండేవి. తారకరత్న చికిత్స తీసుకుంటున్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను అఫీషియల్గా విడుదల చేసేవారు. కానీ గత పది రోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు తారక రత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు మొదట్లో నందమూరి ఫ్యామిలీ తారకరత్న విషయంలో ఎంతో హంగామా చేసి ఇప్పుడు అంత సైలెంట్ గా ఉండిపోయారు.

దీంతో తారకరత్నకు ఏమైందని, ఎందుకు అప్డేట్స్ ఇవ్వట్లేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు తారకరత్నను చికిత్స కోసం విదేశాలకు పంపించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించినట్లు సమాచారం. చికిత్సకు అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో పేరుపడ్డ వైద్య నిపుణులనే ఇక్కడికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.

Taraka Ratna health in critical condition

Taraka Ratna health in critical condition

గుండె, ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ మెదడు దెబ్బ తినడం తారకరత్నకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దాదాపు తారకరత్న కోమస్థితికి దగ్గరగా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో బ్రెయిన్ రికవరీ చేసి సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు తారక రత్న కోలుకొని ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp