Taraka Ratna Wife : గుండెలు పిండేస్తోన్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ .. కంట్లో నీళ్ళు తిరగకుండా చదవలేరు మీరు !

 Authored By prabhas | The Telugu News | Updated on :24 February 2023,10:00 pm

Taraka Ratna Wife : ఇటీవల నందమూరి తారకరత్న కాలం చేశారు. చిన్న వయసులోనే తారకరత్న మరణం అందరిని షాకింగ్ కి గురి చేసింది. గుండెపోటు కారణంగా 23 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఫిబ్రవరి 18న తారకరత్న మృతి చెందారు. ఆయన మరణంతో నందమూరి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక అభిమానులు కూడా చిన్నవయసులోనే తారకరత్న కోల్పోవడం బాధగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే తారక రత్న తన పుట్టినరోజు మూడు రోజులు ఉందనగా చనిపోయారు.

Taraka Ratna wife emotional post on social media

Taraka Ratna wife emotional post on social media

ఆయన పుట్టినరోజు నాడే కుటుంబీకులు చిన్న కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబంతోపాటు పలువురు సినీ ప్రముఖులు తారకరత్నకి నివాళులు అర్పించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్న కర్మకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో తారకరత్న బిడ్డలను చూస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం అని నెటిజన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే అలేఖ్య రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భర్త జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Taraka Ratna wife emotional post on social media

Taraka Ratna wife emotional post on social media

ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కూతురుతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ గొప్ప తండ్రి, గొప్ప భర్త మరియు గొప్ప మనిషి మా బ్యాడ్ లక్ నిన్ను మిస్ అవుతున్నాం , ఐ లవ్ యు సో మచ్ నాన్న అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే నిన్ను చిన్న కర్మ కార్యక్రమంలో తారకరత్నకు నివాళులు అర్పిస్తూ అలేఖ్య బోరుమని ఏడ్చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలను చూస్తే ఎలాంటి వారికైనా గుండె తరుక్కుపోతుంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి