Rajamouli : రాజమౌళి తోపేమీ కాదు .. ఈ మాట అన్నది ఎవరో గెస్ చెయ్యగలరా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : రాజమౌళి తోపేమీ కాదు .. ఈ మాట అన్నది ఎవరో గెస్ చెయ్యగలరా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :24 May 2023,1:00 pm

Rajamouli : నితిన్, సదా హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ‘ జయం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించిన తేజ ఆ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక తేజ సినిమాల కంటే మాటలతో ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన ప్రతి విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడుతారు. అయితే తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ అహింస ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా రానా దగ్గుపాటి తమ్ముడు అభిరామ్ నటించాడు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Teja comments on Rajamouli

Teja comments on Rajamouli

అహింస సినిమా కూడా జయం సినిమాలా ఉందని యాంకర్ అడగగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను తీశాను కాబట్టే రెండు ఒకేలా అనిపిస్తున్నాయి అనీ అన్నారు. రెండు సినిమాలకు తానే డైరెక్టర్ కాబట్టి రెండింటిలోనూ సిమిలారిటీస్ ఉంటాయన్నారు. కొన్ని సీన్స్ ఒకేలా అనిపించడం సహజం అని అన్నారు. నేను మాత్రమే కాదు ఏ డైరెక్టర్ సినిమాలు చేసినా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని పేర్కొన్నారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు కూడా ఒకేలా ఉంటాయని అన్నారు. గౌతమ్ మీనన్ సినిమాలు కూడా ఒకేలా ఉంటాయని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్స్ లలో ఇంటెలిజెన్స్ డైరెక్టర్స్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ఉంటారు.

Teja's shocking comments on Rajamouli

రాజమౌళి, సుకుమార్, వి వి వినాయక్, బోయపాటి వీళ్లంతా ఇంటెలిజెన్స్ డైరెక్టర్స్ కాదని కేవలం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లు మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. తాను కూడా ఇంటెలిజెంట్ డైరెక్టర్ కాదని చెప్పడం విశేషం. నేను ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయితే అన్ని సక్సెస్ లు ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్ ని అయితే ఇన్ని సక్సెస్ లు ఎలా ఉంటాయి అని ప్రశ్నించారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ కాదు అన్నింటిని మించి ఒక మ్యాజిక్ జరుగుతుంది అలా సక్సెలు వస్తాయని తెలిపారు . దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి పై తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్క ఫ్లాప్ లేకుండా తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి తెలియజేసిన రాజమౌళి పై తేజపై అలాంటి కామెంట్స్ చేస్తున్నారా అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది