Tejaswini Nandamuri : బాల‌య్య కూతురి గురించి తొలిసారి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన అల్లుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tejaswini Nandamuri : బాల‌య్య కూతురి గురించి తొలిసారి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన అల్లుడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,6:00 pm

Tejaswini Nandamuri :  తండ్రి వార‌స‌త్వంతో సినిమాల్లోకి వ‌చ్చిన బాల‌య్య ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న‌కి ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు అయిపోయాయి. దీంతో తన కొడుకు మోక్షజ్ఞను ఆయన సినిమాల్లోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలానా దర్శకుడు పరిచయం చేస్తున్నాడని, ఇప్పుడు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని, డ్యాన్స్ నేర్చుకుంటున్నాడని, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్నాడని రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Tejaswini Nandamuri భార్య‌పై ప్రేమ‌..

ఇక ఇదిలా ఉంటే బాల‌య్య ఇప్పుడు కుర్ర‌హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్‌ సినిమాలు చేసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో ఎన్బీకే109 చిత్రంలో నటిస్తున్నారు. సరికొత్త మాస్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతుంది. మ‌రోవైపు త‌న కొడుకు కూతురిని కూడా ఇండ‌స్ట్రీలో మంచి పొజీష‌న్‌లో ఉండేలా పావులు క‌దుపుతున్నార‌ట‌. మోక్ష‌జ్ఞ కంటే ముందే ఆయన కుమార్తె తేజస్విని సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య కూతురు ఎంట్రీపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

Tejaswini Nandamuri బాల‌య్య కూతురి గురించి తొలిసారి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన అల్లుడు

Tejaswini Nandamuri : బాల‌య్య కూతురి గురించి తొలిసారి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన అల్లుడు..!

తేజస్వినిని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీనుతో ఇటీవల సినిమాని ప్రకటించిన విషయం తెలిసింది. బీబీ 4 గా రాబోతున్న ఈ మూవీకి తేజస్విని సమర్పకురాలిగా వర్క్ చేస్తున్నారు. చాలా రోజులుగా బాలయ్య సినిమాలకి తెరవెనుక పనిచేస్తుందట. కాస్ట్యూమ్స్ సెలెక్షన్‌తోపాటు సినిమాల ఎంపికలోనూ ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. క్రియేటివ్‌ సైడ్‌ తేజస్వికి చాలా ఆసక్తి ఉంటుందట. చాలా టాలెంటెడ్‌ కూడా అని చెప్పాడు ఆమె భర్త శ్రీ భరత్‌. ఆయన ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకి అన్నీ తానై చూసుకుంటుందని చెప్పారు. అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షో విషయంలో ఆమె ఇన్‌ వాల్వ్ మెంట్‌ ఉందట. ఆమె గైడెన్స్ ప్రకారమే బాలయ్య చేస్తున్నారు. గతంలో బాల‌య్య‌కి కోపం ఎక్కువ అని తెలుసు. ఆని అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత ఆయ‌న‌లో హ్యూమ‌ర్ ఉంద‌ని జ‌నాల‌కి అర్ధ‌మైంది. దానికి కార‌ణం తేజ‌స్వి అంటూ భ‌ర‌త్ తెలిపారు. ఆమె సినిమాల్లోకి వ‌చ్చి ఉంటే పెద్ద హీరోయిన్ అయి ఉండేద‌ని కూడా ఆయ‌న తెలిపారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది