Bigg Boss OTT : తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను సూపర్ హిట్ చేశారు. వీక్ డేస్ లో కాస్త లైట్ తీసుకున్నా వీకెండ్స్ మరియు స్పెషల్ ఎపిసోడ్స్ ను మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తూనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు గాను బిగ్ బాస్ నిర్వాహకులు ఓటీటీ ద్వారా బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే హిందీ లో ఓటీటీ బిగ్ బాస్ వచ్చింది. కరణ్ జోహార్ హోస్ట్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు లో కూడా ఓటీటీ బిగ్ బాస్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.. దానికి కూడా నాగార్జున హోస్టింగ్ చేస్తాడని అంటున్నారు. అయితే ఫార్మట్ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.
తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తితో ఎదురు చూడటం కు నాలుగు సూపర్ ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ అయ్యాయి. ఈ విషయాలు షో పై అంచనాలు పెంచడంతో పాటు ఎప్పుడెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ను సాదారణంగా టీవీ లో చూడటం అదే ఎపిసోడ్ ను హాట్ స్టార్ లో చూడటం తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కాని బిగ్ బాస్ ను ఓటీటీ లో అది కూడా 24 గంటల పాటు కంటెస్టెంట్స్ ను చూసే అవకాశం ఉండటం ఖచ్చితంగా ప్రేక్షకులకు ఎగ్జైట్ మెంట్ ను కలిగిస్తుంది. ఇక ఈ ఓటీటీ కి సంబంధించిన మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఓటీటీ బిగ్ బాస్ సీజన్ 1 కు ఓంకార్ దర్శకత్వం వహిస్తాడట.
కొన్ని ఎపిసోడ్స్ లో నాగార్జున మాత్రమే కాకుండా ఓంకార్ కూడా కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయితే అవి స్పెషల్ ఎపిసోడ్స్ అని వీకెండ్స్ లో మాత్రం నాగార్జున మాత్రమే వస్తాడు అన్నట్లుగా యూనిట్ సభ్యుల నుండి లీక్ వచ్చింది. ఇక ఫిబ్రవరి మూడవ ఆదివారం లేదా నాల్గవ ఆదివారంలో మాత్రమే ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో లీక్ ఏంటీ అంటే షో ను కరోనా థర్డ్ వేవ్ కాని మరేమైనా రాని ఖచ్చితంగా ఆపేదే లేదు అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ షో కు సంబంధించిన ఈ లీక్ లు ఓటీలో బిగ్ బాస్ ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తామా అన్నట్లుగా వెయిట్ చేసేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.