ETV Rating : నెం.1 నుండి నెం.4 కు వెళ్లడంకు తెగ ఉబలాట పడుతున్న ఈటీవీ
ETV Rating : 1990ల్లో శాటిలైట్స్ ఛానల్స్ హవా మొదలు అయ్యింది. అంతకు ముందు వరకు దూరదర్శిన్ ను మాత్రమే తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని శాటిలైట్ ఛానల్స్ వచ్చాయో మొత్తం పరిస్థితి మారిపోయింది. తెలుగు లో జెమిని టీవీ మరియు ఈటీవీలు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం మొదలు పెట్టాయి. సరిగ్గా చెప్పాలంటే 1995 లో ఈటీవీ ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో పోటీ అస్సలు లేదు. దాంతో ఆ టీవీలో ఏది వస్తే అది చూశారు.. ఆ సమయంలో ఏం చూపిస్తే అదే జనాలు ఎంజాయ్ చేసేవారు. కాని పోటీ పెరుగుతూ వచ్చింది..
దాంతో టీవీ చానల్స్ కూడా కంటెంట్ క్వాలిటీ పెంచుతూ వచ్చాయి. 1995 లో జెమిని టీవీ మరియు ఈటీవీ లు కాస్త గ్యాప్ తో ప్రారంభం అయ్యాయి. దాదాపు పది సంవత్సరాల పాటు ఈ రెండు ఛానల్స్ కు పోటీ అనేది లేదు. ఆ సమయంలో ఈటీవీ నెం.1 స్థానంలో ఉండేది. 2002 లో మా టీవీ, 2005 సంవత్సరం లో జీ తెలుగు ఛానల్స్ ప్రారంభం అవ్వడంతో ఈటీవీ మరియు జెమిని టీవీలకు పోటీ మొదలు అయ్యింది. మరో వైపు న్యూస్ ఛానల్స్ మొదలు అయ్యాయి. మొత్తంగా వందల కొద్ది తెలుగు ఛానల్స్ మొదలు అయ్యాయి. అయినా కూడా ఈటీవీ టాప్ లోనే కొనసాగుతూ వచ్చింది. కాని ఎప్పుడైతే సీరియల్స్ విషయంలో పట్టు కోల్పోయారో అప్పుడు రేటింగ్ తగ్గుతూ వచ్చింది. స్థానం దిగజార్చుకుంటూ వచ్చింది.
సీరియల్స్ లేక పోయినా కూడా ప్రైమ్ టైమ్ లో వచ్చిన జబర్దస్త్, ఢీ, క్యాష్, పాడుతా తీయగా, స్వరాభిషేకం ఇంకా కొన్ని కార్యక్రమాలతో ఈటీవీ టాప్ లోనే కొనసాగేలా చేసింది. సీరియల్స్ తో స్టార్ మా నెం.1 కు దూసుకు వచ్చినా ఈటీవీ మాత్రం నెం.2 స్థానం లో నిలిచింది. ఇప్పుడు జబర్ధస్త్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఢీ ని కూడా చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇక సీరియల్స్ విషయం సరేసరి. ఇలాంటి సమయంలో ఈటీవీ రేటింగ్ నెం.4 కు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. జబర్దస్త్ మరియు ఢీ షో లను చేజేతుల ఈటీవీ వారు నాశనం చేస్తున్నారు. నెం.4 కు వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా ఉంది. ఇప్పటికి అయినా ఈటీవీ వారు మేలుకుంటే బెటర్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.