Sudheer Rashmi : నేను ఎక్కడున్నా నువ్ నా మనసులోనే ఉన్నావ్.. సుధీర్ మాటకు రష్మీ ఫ్లాట్.. వెచ్చని కౌగిలి ఇచ్చిన యాంకర్

Authored By aruna | The Telugu News | Published on: August 10, 2023, 12:01 pm

Sudheer Rashmi : బుల్లితెరపై ఎప్పుడూ ఎవ్వరికీ బోర్ కొట్టని టాపిక్ ఏదైనా ఉందంటే.. అది కేవలం సుధీర్ రష్మీ గురించే. ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో జంటలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ సుధీర్ రష్మీ చేసిన మ్యాజిక్, క్రియేట్ చేసిన కెమిస్ట్రీని ఇంత వరకు ఏ జంట కూడా మళ్లీ క్రియేట్ చేయలేకపోయింది. మధ్యలో ఇమాన్యుయేల్ వర్షలు చేశారు. కానీ అతి ఎక్కువ అవ్వడంతో జనాలు పట్టించుకోలేదు. సుజాత రాకేష్‌లు రియల్ లైఫ్‌లోనూ జంటగా మారారు. ఇక ఎంతో మంది ఇలా జబర్దస్త్ స్టేజ్ మీద జంటలుగా వచ్చారు. కానీ సుధీర్ రష్మీ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

సుధీర్ రష్మీ జంటకు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు. అటు నుంచి సినిమాలంటూ బిజీగా ఉంటున్నాడు. మల్లెమాలకు, ఈటీవీకి దూరంగా ఉన్నాడు. రష్మీ మాత్రం మల్లెమాల, ఈటీవీకే అతుక్కుపోయి ఉంటుంది. తాజాగా సుధీర్ రష్మీ ఒక్క స్టేజ్ మీదకు వచ్చారు. ఈటీవీ 28వ వార్షికోత్సవం అంటూ ఈ ఇద్దరూ పక్కపక్కనే కనిపించారు. దీంతో అభిమానులు సంబరపడిపోతోన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Sudheer Rashmi ,Sudheer And Rashmi in ETV 28th Anniversary Celebration

Sudheer Rashmi ,Sudheer And Rashmi in ETV 28th Anniversary Celebration

ఈ ఈవెంట్‌కు ఈటీవీ బలగం అంటూ అందరినీ పిలిపించారు. ప్రత్యేకంగా చంద్రబోస్‌ను సత్కరించారు. ఆస్కార్ అవార్డును తీసుకు రావడంతో చంద్రబోస్‌ను ఇలా సన్మానించారు. అయితే ఈ ఈవెంట్‌లో రష్మీ ఏకంగా సుధీర్ ఎదపై వాలిపోయింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావ్.. నువ్ వస్తావని ఎదురుచూస్తూనే ఉన్నాను అని రష్మీ అంటుంది. నేను ఎక్కడున్నా కూడా నువ్ మాత్రం నా మనసులో, గుండెలోనే ఉంటావ్ అని సుధీర్ అనడంతో రష్మీ ఫ్లాట్ అయిపోయింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp