Vishnu Priya : విష్ణు ప్రియ తల్లి చనిపోయింది అని తెలిసి ఈటీవీ వాళ్ళు సంచలన నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : విష్ణు ప్రియ తల్లి చనిపోయింది అని తెలిసి ఈటీవీ వాళ్ళు సంచలన నిర్ణయం

 Authored By kranthi | The Telugu News | Updated on :28 January 2023,2:20 pm

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుసు కదా. తెలుగు బుల్లితెర మీద తనకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరపై బాగా రాణించింది. ఈటీవీలో పోవే పోరా షోతో హైలెట్ అయింది. ఆ తర్వాత తను తెలుగులో నెంబర్ వన్ యాంకర్ అయింది. సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. మరోవైపు తనకు సినిమా అవకాశాలు కూడా రావడంతో సినిమాల వైపు వెళ్లింది విష్ణుప్రియ. కానీ.. సినిమాల్లో తనకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. యాంకరింగ్ లోనే  పలు అవకాశాలు వచ్చాయి కానీ.. అవి కూడా తనకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు.

etv wants to support vishnu priya

etv wants to support vishnu priya

దీంతో తను సోషల్ మీడియాలోనే రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ పెడుతూ వైరల్ చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే విష్ణుప్రియ తల్లి ఇటీవల కన్నుమూశారు. ఆమె చనిపోవడంతో యాంకర్ విష్ణుప్రియ సోకసంద్రంలో మునిగిపోయింది. తనను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఇటీవల ఇన్ స్టాలో తన తల్లి గురించి, తన తల్లి ఈ లోకాన్ని వీడిపోయిందని చెబుతూ కంటతడి పెట్టింది విష్ణుప్రియ.

Vishnu Priya : విష్ణుప్రియకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిన ఈటీవీ యాజమాన్యం

etv wants to support vishnu priya

etv wants to support vishnu priya

అయితే.. విష్ణుప్రియ ముందుగా ఈటీవీ ద్వారానే లైమ్ లైట్ లోకి రావడంతో ఇప్పుడు తన తల్లి కూడా చనిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోతుందని భావించిన ఈటీవీ యాజమాన్యం.. తనకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. తనకు యాంకరింగ్ గా అవకాశాలు ఇవ్వాలని ఈటీవీ వాళ్లు అనుకుంటున్నారట. త్వరలోనే ఈటీవీలో ప్రారంభం కాబోయే కొన్ని షోలకు విష్ణుప్రియను యాంకర్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజం అయితే విష్ణుప్రియకు ఇంతకన్నా మంచి చాన్స్ ఉండదు. ఇప్పుడే తనేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది