MAA Election : మా ఎన్నికల్లో ఉద్రిక్తత.. కొట్టుకోబోయిన నటులు.. ఎవరెవరంటే..?

Authored By praveen T | The Telugu News | Published on: October 10, 2021, 1:20 pm

MAA Election :మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్యానెల్ కోసం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించగా, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, తనికెళ్ల భరణి తదితరులు ఓటు వేసేందుకుగాను పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

tension in maa election

tension in maa election

అయితే, పోలింగ్ కేంద్రం వద్ద సీనియర్ నటుడు నరేశ్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ వ్యక్తి రిగ్గింగ్ చేశాడని అతడిని పట్టుకోవాలని, అతడిని కొట్టబోయాడు నరేశ్. ఈ క్రమంలో నరేశ్‌ను అడ్డుకుని ప్రకాశ్ రాజ్ తనను కొట్టాలని అన్నాడు. అయితే, కొట్టాల్సింది నిన్ను కాదని, దొంగ ఓట్లు వేసిన వ్యక్తిని అని చెప్తూనే నరేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మొత్తంగా ప్రకాశ్ రాజ్, నరేశ్ మాధ్య మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడులకు దిగేంత వరకు వచ్చేసిందని పలువురు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపోతే మా పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి రిగ్గింగ్ చేశాడంటూ మంచు విష్ణు ప్యానెల్ బృందం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.

Also read

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp