Lucifer Remake : థమన్ కల నెరవేర్చిన మెగాస్టార్.. లూసీఫర్ తెలుగు రీమేక్ కి ఛాన్స్.. !
Thaman Lucifer Remake music director థమన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా విపరీతమైనం క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగుతో ఏ స్టార్ హీరో సినిమా మొదలవుతున్నా కూడా మ్యుజిక్ డైరెక్టర్ గా థమన్ పేరే పరిశీలిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తో థమన్ టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. ఈ సినిమా రిలీజై సంవత్సరం దాటిపోయినా ఇంకా అల లోని సాంగ్స్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తునే ఉన్నాయి.

Thaman Locked for Chiranjeevi Lucifer Remake Movie
థమన్ ఇచ్చే సాంగ్స్ ఆల్బం మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతోంది. సినిమాకి సగం ప్రాణం సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు సక్సస్ అయితే ఇక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్సై పోవచ్చు. థమన్ ఈ విషయంలో పెద్ద బాధ్యత తీసుకుంటున్నాడు. కమిటయిన ప్రతీ సినిమాకి సూపర్ హిట్ ఆల్బం తో పాటు థియేటర్స్ దద్దరిలీపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇస్తున్నాడు. అందుకే థమన్ కి వరసగా స్టార్ హీరోల సినిమాలకి మ్యూక్ అందించే అవకాశాలు వస్తున్నాయి.
ఇక సినిమా ఇండస్ట్రీలో దర్శకులకి సంగీత దర్శకులకి.. హీరో హీరోయిన్స్ కి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పనిచేయాలన్నది పెద్ద డ్రీం గా ఉంటుంది. అలాంటి డ్రీం థమన్ కి ఉంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ఒక సినిమాకైనా మ్యూజి అందించే అవకాశం వస్తుందేమో అని థమన్ కల కన్నాడు. అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి థమన్ కల నేరవేర్చారు. ఈ విషయాన్ని థమన్ స్వయంగా వెల్లడించాడు.