Amala Akkineni : అమల గురించి టాప్ సీక్రెట్ బయటపడింది .. నాగార్జున కంటే ముందే ఆ హీరోతో పెళ్లి ..!!
Amala Akkineni : బెంగాలీ అమ్మాయి అయినా అమల మొదటగా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో కింగ్ నాగార్జున శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే కోలీవుడ్ లో కూడా చాలామంది హీరోలతో నటించింది. అయితే నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. వీరిద్దరికి పుట్టిన కుమారుడే నాగచైతన్య.
The top secret about Amala Akkineni is out
శ్రీలక్ష్మి తో విడిపోయాక నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి శివ, నిర్ణయం సినిమాలు చేశారు. ఈ సమయంలోనే వీళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లిదాకా వెళ్లారు. వీళ్ళిద్దరికి పుట్టిన కుమారుడే అఖిల్. ఇక నాగార్జున అమలతో పెళ్లి అయిన తర్వాత కూడా టబూతో ప్రేమాయణం నడిపాడని, అమల చాలా తెలివిగా కంట్రోల్లో పెట్టుకుందని టాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే అమల గురించి టాప్ సీక్రెట్ ఒకటి బయటికి వచ్చింది. అమల నాగార్జున కంటే ముందే కోలీవుడ్ లో ఒక స్టార్ హీరోను ప్రేమించిందట. ఆ హీరో కూడా అమ్మాయిల విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటాడట, పెద్ద స్టార్ హీరో అంట.
ఇప్పటికి రెండు పెళ్లిళ్లు, సహజీవణాలు, పెటాకులు అయ్యాయి. ఎంతో మంది హీరోయిన్లతో ఆ స్టార్ హీరో ప్రేమాయణం నడిపాడట. ఈ క్రమంలోనే అమల కూడా అతడి ప్రేమలో పడిందని, ఎప్పుడు అయితే అతడి మనసత్వం పూర్తిగా తెలిసిందో అప్పటినుంచి అతడికి దూరంగా ఉంటూ తెలుగులో నాగార్జున తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే నాగార్జునతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం అమల అడపా దడపా సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్ గా కనిపించే అమలు జంతువులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటికి ప్రత్యేకంగా సంరక్షణ కూడా అందిస్తున్నారు.
