Pushpa 2 Movie : పుష్ప 2 కోసం ఎదురు చూస్తోన్న అల్లూ అర్జున్ ఫ్యాన్స్ కి నిద్ర కూడా పట్టని బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 Movie : పుష్ప 2 కోసం ఎదురు చూస్తోన్న అల్లూ అర్జున్ ఫ్యాన్స్ కి నిద్ర కూడా పట్టని బ్రేకింగ్ న్యూస్ !

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 October 2022,2:30 pm

Pushpa 2 Movie : పుష్ప సినిమా సినీ ఇండస్ట్రీలోనే ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం తెలుగు కాదు.. అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా నార్త్ లో అయితే బ్లాక్ బస్టర్ అయింది. పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా శ్రీవల్లి గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ రష్మిక మందన్నాకు అయితే ఈ సినిమాతోనే ఒక్కసారిగా పేరొచ్చింది. పాని ఇండియా హీరోయిన్ అయిపోయింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయారు.

పుష్ప ది రైజ్ సినిమా విజయంతో మాంచి ఊపు మీద ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాదు.. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉండబోతున్నాయట. అందుకే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. కథను ఫైనలైజ్ చేస్తున్నాడు సుకుమార్. ఇక.. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాకముందే ఒక పోస్టర్ ను విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట.

there is a sentiment scene in pushpa 2 to become block buster hit

there is a sentiment scene in pushpa 2 to become block buster hit

Pushpa 2 Movie : పుష్ప 2 పోస్టర్ డిజైనింగ్ పనిలో మూవీ యూనిట్

పుష్ప రైజ్ సినిమాకు కూడా అలాగే పోస్టర్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చూసి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవబోతున్నారు. ఈ పోస్టర్ డిజైన్ కోసం ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ పని చేస్తున్నారు. పుష్ప వన్ సినిమా ఎలా సూపర్ డూపర్ హిట్ అయిందో పుష్ప 2 కూడా అలాగే సూపర్ డూపర్ హిట్ అయినట్టే. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 మూవీ రూ.350 కోట్లతో తెరకెక్కుతోంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది