Waltair Veerayya : చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్ అట్టర్ ఫ్లాప్..?? ఈ ఐదు కారణాలు చూసే మీరు కూడా అవును అంటారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Waltair Veerayya : చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్ అట్టర్ ఫ్లాప్..?? ఈ ఐదు కారణాలు చూసే మీరు కూడా అవును అంటారు…!!

 Authored By kranthi | The Telugu News | Updated on :8 January 2023,9:20 pm

Waltair Veerayya : ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అది యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతోంది. అలాగే.. ఈ సినిమాలో చిరంజీవి గెటప్ కూడా చాలా వెరైటీగా, కొత్తగా ఉంటుంది. అలాగే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. కేథరిన్ థెరిసా సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎందుకో ఈ ట్రైలర్ లో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. ట్రైలర్ చూస్తే మొత్తం యాక్షన్ సీన్సే కనిపిస్తుండటంతో.. కొంచెం కామెడీ సీన్స్ ను యాడ్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు నెటిజన్లు. ట్రైలర్ మొత్తం డైలాగ్స్ తో నింపేశారు. కొన్ని డైలాగ్స్ అయినా ఆపితే బాగుండేది అంటున్నారు.

these are the minus points in waltair veerayya movie trailer

these are the minus points in waltair veerayya movie trailer

Waltair Veerayya : ట్రైలర్ మొత్తం డైలాగ్సే అంటున్నారు

కాకపోతే లాస్ట్ డైలాగ్ మాత్రం ట్రైలర్ ను ఎక్కడికో తీసుకెళ్లింది అంటున్నారు. అసలు ట్రైలర్ తోనే సినిమా కథ ఏంటో అర్థం అయిపోయింది అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదంటున్నారు. రవితేజ గురించి ఇంకొంచెం ఏదైనా సీన్ చూపించి ఉంటే బాగుండేది అంటున్నారు. ఇలా.. వాల్తేరు వీరయ్య సినిమా గురించి పలు రకాలుగా నెగెటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ.. సినిమా విడుదల అయితే కానీ.. సినిమా సత్తా ఏంటో తెలియదు అని మెగా ఫ్యాన్స్ కూడా నెగెటివ్ కామెంట్లు చేసే వారికి కౌంటర్ ఇస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది