Shruti Haasan : వాల్తేరు వీరయ్య వర్సెస్ వీర సింహారెడ్డి.. శృతి హాసన్ ఎక్కువ పారితోషికం ఏ సినిమాకు తీసుకుందో తెలుసా!
Shruti Haasan : మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అంతే కాకుండా విచిత్రంగా ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలు శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.
ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి నటించడం అంటేనే చాలా అరుదైన విషయం, అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి నటించి ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది కేవలం శృతి హాసన్ కి మాత్రమే దక్కిన అరుదైన రికార్డ్ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాల్లో నటించినందుకు గాను శృతి హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటూ చర్చ మొదలు అయ్యింది. ఈ ముద్దుగుమ్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయమై క్లారిటీ లేదు,
కానీ మైత్రి మూవీస్ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా కు ఎక్కువ రోజులు కేటాయించినందున శృతి హాసన్ కి కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కిందని… బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కు వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ అందిందని సమాచారం అందుతుంది. డేట్ లను బట్టి ఎవరైనా రెమ్యూనరేషన్ తీసుకుంటారు.. కనుక వాల్తేరు వీరయ్య సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసింది కనుక శృతి హాసన్ ఆ సినిమాకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.