Chiranjeevi : చిరంజీవి కూడా ఆ మాట అనేశాడురోయ్ థియేటర్స్ లో పునాకలే..
chiranjeevi సంక్రాంతి Sankrati కానుకగా ఈరోజు చిరంజీవి Chiranjeevi ‘ వాల్తేరు వీరయ్య waltair veerayya ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామ చేస్తున్నారు. సినిమా కూడా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ జిన్నా ‘ సినిమాలో జంబలకిడి జారు మిఠాయి అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పు, సన్నిలియోన్ హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ సినిమా కోసం చిత్తూరు ప్రాంతంలో పాడుకునే ఈ జంబలకిడి జారు మిఠాయి అనే ఒక జానపదాన్ని ఎంచుకొని దాన్ని కాస్త మ్యూజిక్ టచ్ తో వేరే ట్యూన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఆ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదు కానీ ఫ్రీ రిలీజ్ వేడుకలో ఈ పాట ఒరిజినల్ గా పాడిన ఇద్దరు మహిళలను తీసుకొచ్చారు. అందులో ఒక మహిళ నేను చీర కడతాను చూడు నేను చీర కడతాను చూడు ఆ చీర సాయి చూడకుంటే తీసేస్తా చూడు అంటూ పాడింది. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జంబలకిడి జారు మిఠాయి అనే పదం కూడా బాగా వైరల్ అయింది. ఈ జంబలకిడి అనే పదానికి అర్థం తెలియకపోయినా అందరూ బాగా వాడేస్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా వాడడం ఆసక్తికరంగా మారింది. జనవరి 13న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
అయితే ఈ సినిమాలో ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్ పాడినట్లుగా తెలుస్తుంది. అయితే ఒరిజినల్గా ఈ పాట చీర గురించి ఉంటుంది. కానీ చిరంజీవి మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో లుంగీ పాట గురించి పాడినట్లు తెలుస్తుంది. నా లుంగి తీసేస్తా చూడు తీసేస్తా చూడు జంబలకిడి జారు మిఠాయి అని పాడడంతో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మంచు మనోజ్ జిన్నా సినిమా కంటే ఈ జంబలకిడి జారు మిఠాయి అనే పాట బాగా పాపులర్ అయింది. అయితే ఈ పాటను చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో పాడడంతో చర్చనీయాంశంగా మారింది.