These are the most married celebrities
Celebrities Marriages : సినీ ఇండస్ట్రీలో ఒక్కపెళ్లితో సరిపెట్టుకున్నొళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరు సెలబ్రెటీలు రెండు అంతకు మించి పెళ్లీలు చేసుకున్నవారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. స్టార్ స్టేటస్ వచ్చాక.. స్టార్ స్టేటస్ రాకముందు.. మనస్పర్థలు వచ్చి కొంతమంది.. పెళ్లి అయిన తర్వాత మరొకరితో ప్రేమలో పడి మరికొందరు పెళ్లి చేసుకున్నా వారు ఉన్నారు. కొంతమంది మొదటి భార్య అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నవారు.. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నవారూ ఉన్నారు. మరికొంతమంది మనస్పర్థలు వచ్చి వారితో పొసగక విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు. కొంతమంది సహజీవనం చేసినవారూ ఉన్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు సహ జీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూడో భార్యకు దొరికిపోయారు. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లీలు చేసుకున్నాడు. మొదట సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీల్లిద్దరికీ నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికీ ఓ కుమారుడు ఉన్నాడు. ఆమెతో మనస్పర్థల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు. తాజాగా పవిత్ర లోకేష్‌తో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
These are the most married celebrities
ఇక పవిత్ర లోకేష్ ముందుగా ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో మనస్పర్థలు వచ్చి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు సుచీంద్ర ప్రసాద్ తో సహ జీవినం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. తాజాగా సీనియర్ నటుడు నరేష్‌కు దగ్గరైంది. త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. ఈ పెళ్లి జరిగితే పవిత్రకు ఇది మూడో పెళ్లి అవుతోంది.
పవన్ కల్యాణ్ 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రేణు కూడా డైవర్స్ ఇచ్చి రష్యన్ అమ్మాయి అన్నా లెజినీవాను పెళ్లి చేసుకున్నాడు. అలాగే అక్కినేని నాగార్జున వెంకటేష్ చెల్లెలు, రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నాగచైతన్య జన్మించిన తర్వాత అనివార్య కారణాలతో విడిపోయాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు.
These are the most married celebrities
సునిత 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గతేడాది రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. మొదటి భార్య చనిపోవడంతో తేజస్వీని రెండో వివాహాం చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక రీసెంట్‌గా ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. నటుడు సామ్రాట్ రెడ్డి మొదటి భార్య హర్షితరెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత 2010లో అంజనా శ్రీలిఖితను రెండో వివాహం చేసుకున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా అనుమతితో తోటి నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. నటుడు హరికృష్ణ షాలినిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే జూనియర్ ఎన్టీఆర్. అలాగే నటసార్వబౌమ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం మరణానంతరం లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా 20 ఏళ్ల కిందే రమాలత్ ని పెళ్లి చేసుకోగా కొన్ని కారణాలతో విడిపోయాడు. ఆ తర్వాత నయనతారతో పెళ్లి వరకు వచ్చినా అది జరగలేదు. ఇక ఇటీవల తనకు ఫిజియోతెరపీ చేసిన డాక్టర్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నటుడు ప్రకాశ్ రాజ్1994లో డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని పెళ్లి చేసుకుని 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.
These are the most married celebrities
కమల్ హాసన్ 24 ఏళ్ల వయసులో 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. విడాకుల కంటే ముందే 1984 నుంచే సారికతో సహజీవనం చేసి శృతిహాసన్ పుట్టిన తర్వాత 1986లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో కూడా విడిపోయి గౌతమి, సిమ్రాన్ బగ్గా లాంటి హీరోయిన్స్‌తో సహజీవనం చేశాడు. ఆ తర్వాత ప్రముఖ నటి సారికను కమల్ హాసన్ రెండో వివాహం చేసుకున్నారు. మోహన్ బాబు కూడా తన మొదటి భార్య విద్యా దేవి చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మల దేవిని రెండో వివాహం చేసుకున్నారు. సావిత్రి, జెమినీ గణేషన్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జెమినీ గణేషన్ మరో రెండు పెళ్లిళ్లు చేసుకోగా మొత్తంగా ఈయన నాలుగు పెళ్లి చేసుకున్నారు.
These are the most married celebrities
సీనియర్ నటి రాధిక దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో పెళ్లి చేసుకుని.. ఆతర్వాత విడాకులు ఇచ్చి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చి కొన్నేళ్ల కిందట శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్ కుమార్ కూడా 1984లో ఛాయను పెళ్లి చేసుకుని ఆమెతో 2000 సంవత్సరంలో విడిపోయాడు. ఆ మరుసటి ఏడాది రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. శరత్ బాబు తనకంటే వయసులో పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత స్నేహలతా దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లు కూడా కలిసి ఉండటంలేదు. ఇంకా ఇలా చెపపుకోవాలంటే పెద్ద లిస్టే ఉంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.