
Samantha
Samantha : సమంత అక్కినేని సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. పెళ్ళికి ముందు ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసిందో పెళ్ళి తర్వాత వాటికి పూర్తి భిన్నంగా మారిపోయింది. మజిలీ, ఓ బేబీ, జాను లాంటి కథా బలమున్న పాత్రలనే ఒప్పుకుంటోంది. కంప్లీట్ పర్ఫార్మెన్ కి స్కోప్ ఉన్న పాత్రలే కాదు నెగిటివ్ రోల్ అలాగే భర్త నాగ చైతన్యతో కలిసి నటించే అవకాశాల కోసమే ఎదురు చూస్తోంది. మజిలీ వంటి కథ ఉంటే ఇద్దరు కలిసి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట. దాంతో మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక తన పదేళ్ళ కెరీర్‌లో మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం సమంత రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో శాకుంతలం..తమిళంలో ‘కాతువకుల రెండు కాదల్’. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే శాకుంతలం కోసం బల్క్ డేట్ ఇచ్చిన సమంత బాగా సపోర్ట్ చేస్తుందట. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే 2022 సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం. ఇటీవలే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. ది ఫ్యామిలీ మాన్ గనక హిట్ అయితే నెక్స్ట్ ప్లాన్ బాలీవుడ్ సినిమాకి సైన్ చేస్తుందట.
this is the reason for samantha energy
అయితే సమంత ఇంత ఎనర్జీతో ఉండటానికి కారణం తను క్రమం తప్పకుండా చేసే వ్యాయామమే అని చెబుతోంది. ఒకరోజు భోజనం లేకపోయినా పరవాలేదు గాని వ్యాయామం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనట. అదే తన అందానికి ఫిట్‌నెస్ కి సీక్రెట్ అని చెబుతోంది. ఇక సమంత ఒకవైపు సినిమాలు..మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. అంతేకాదు సొంత వ్యాపారాలలో కూడా తన సత్తా చాటుతోంది. కాగా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకోబోతోంది. కావ్యనాయకి శాకుంతలగా తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టబోతుంది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.