ap cm ys jagan mohan reddy ysrcp
YS Jagan : వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో బాగానే పటిష్ఠంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రగా బాధ్యతలు స్వీకరించినా.. బాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే పూర్తయింది. ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ అధికారంలో ఉంటారు. మరో మూడేళ్ల పాటు.. వైసీపీ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే.. కావాల్సిన దాని కంటే ఎక్కువ బలం ఉంది వైసీపీ పార్టీకి. టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుమని పది మంది కూడా లేరు. ఏపీలో వైఎస్ జగన్ దే మరో మూడేళ్ల వరకు రాజ్యం అని అంతా అనుకుంటున్నారు కానీ.. ఏమో.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
ap cm ys jagan mohan reddy ysrcp
ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బయట పన్నాగాలు జరుగుతున్నాయి.. అని వైసీపీ నేతలే బాహటంగా చెబుతున్నరు. నిజానికి.. వైసీపీ ప్రభుత్వం కూలే చాన్స్ ఉందా అసలు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొన్నిసార్లు దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆయనపై ఉన్న అక్రమాస్తులు కూడా ఆయన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. న్యాయవ్యవస్థపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఆరోపణలు చేయడం అనేది నిజంగా డేరింగ్ అనే చెప్పుకోవాలి. ఇలా.. కొన్ని విషయాల్లో సీఎం జగన్ ప్రదర్శించిన దూకుడుతనాన్ని ఆసరాగా చేసుకొని.. ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నాగాలు చేస్తున్నారు.. అనేది చాలారోజుల నుంచి ఉన్న టాకే.
అయితే.. వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఇన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అడ్డం పెట్టుకొని చంద్రబాబు బాగానే గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. అక్రమాస్తుల కేసులో జగన్ కు వచ్చిన బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అన్ని రకాలుగా సీఎం జగన్ ను ఇబ్బందులకు గురి చేసి.. ఒక వేళ జగన్ జైలుకు వెళితే.. ప్రభుత్వం కూలిపోతుంది కదా.
ap cm ys jagan mohan reddy ysrcp
అది ప్రతిపక్ష పార్టీల ప్లాన్ అన్నమాట. ఏది ఏమైనా.. జగన్ పై విమర్శలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. అది చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది. ఏది ఏమైనా.. జగన్ ఒకవేళ జైలుకు వెళ్లినా కూడా వైసీపీ ప్రభుత్వానికి ఏం కాదని.. అప్పుడు జగన్ మీద ఇంకాస్త సానుభూతి పెరుగుతుంది తప్పితే తగ్గదని.. ప్రతిపక్షాలు ఎంత కష్టపడి.. వైసీపీ ప్రభుత్వాన్న కూలగొట్టాలన్నా.. అది సాధ్యం కాని పని అని.. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి అని.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడే ఏపీలో లేడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.